News

gravita india, Trending Stocks: కుప్పకూలిన మార్కెట్లు.. అయినా 4% పెరిగిన షేర్.. ఈ ట్రెండింగ్ స్టాక్ మీ దగ్గరుందా? – top trending stock gravita india jumped over 4 precent during wednesday trading session


Trending Stocks: కొద్ది రోజులుగా వరుస సెషన్లలో మంచి లాభాలను ఆర్జించిన దేశీయ మార్కెట్ సూచీలు ఇవాళ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బుధవారం ఆరంభం నుంచే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈలోని దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే, మార్కెట్లు పడుతున్నప్పటికీ కొన్ని క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది. వీటిల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్టాక్ ఇవాళ్టి సెషన్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. అదే గ్రావిటా ఇండియా (Gravita India), ఎన్ఎస్ఈ కోడ్ (NSE Code – GRAVITA). బుధవారం సెషన్ ఆరంభంలోనే ఈ స్టాక్ 4 శాతానికిపైగా లాభపడింది.

త్రైమాసిక ఫలితాల్లో మంచి పనితీరు కనబరిచిన ఈ మెటల్ కంపెనీ షేర్లు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో 50 శాతం లాభంతో రూ.706.76 కోట్లు రెవెన్యూ సాధించింది. నికర లాభం 125 శాతం మేర పెరిగి రూ.17.32 కోట్లుగా ఉంది. సాంకేతిక పారామీటర్స్ చూసుకున్న ఈ స్టాక్ ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్ బలంగానే ఉంది. దీంతో ఎన్ఎస్ఈలో జీవితకాల గరిష్ఠం రూ.523 స్థాయిని తాకింది. 14 రోజుల పీరియడ్ ఆర్ఎస్ఐ 72.24గా ఉండగా ఎంఏసీడీ మంచి స్థాయిలో కొనసాగుతోంది. బుల్లీష్ ట్రేడ్‌లో మంచి టెక్నికల్ సెటప్‌ను కలిగి ఉంది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మార్కెట్లు పడుతున్నా దూసుకెళ్తున్న స్టాక్స్ ఇవే.. వీటిపై ఓ లుక్కేయండి..

గత ఏడాదిలో ఈ స్టాక్ విలువ 62 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో ఈ స్టాక్‌ను తమ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రానున్న సెషన్లలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

గత కొన్ని సెషన్లలో భారీగా పెరిగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ పడిపోతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 734 పాయింట్ల నష్టంతో 60 వేల 251 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 218 పాయింట్లు దిగజారి 17 వేల 900 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్‌యూఎల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదాని ఎంటర్ ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ సగటున 3 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

భారతదేశపు నంబర్ 1 ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్ ఈ ఆర్టికల్‌ను అందించింది. విన్నింగ్ స్టాక్స్, సిఫార్సులకు సంబంధించిన అప్‌డేట్స్ క్రమం తప్పకుండా పొందడం కోసం ఈ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated verified.

  • Read Latest Business News and Telugu News

మార్కెట్లలో భారీ పతనం.. ఈ రూపాయి షేర్లు మాత్రం రోజూ అప్పర్‌సర్క్యూటే!

ఆధార్ నంబర్‌ ఉంటే చాలు.. ఈ 6 రకాల బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయొచ్చు..!

Advertisement

ఏ బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అన్నింటి లిస్ట్ ఇదే..

Related Articles

Back to top button