News

google pay, Fraud Alert: Phone Pe, గూగుల్ పే వాడుతున్నారా? సరికొత్త మోసం.. భారీగా నష్టపోతారు.. ఇలా అస్సలు చేయకండి! – fraud alert scamsters using google pay, phone pe to con you, 81 users lose rs. 1 crore


Fraud Alert: భారతదేశం డిజిటల్ దిశగా దూసుకెళ్తుంటే.. ఇదే క్రమంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. సరికొత్త ఆన్‌లైన్ మోసాలకు తెరతీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు కాపాడుకోవడమే కష్టంగా మారింది. తాజాగా సైబర్ నేరగాళ్లు ముంబయికి చెందిన 81 మందిని మోసం చేశారు. 16 రోజుల్లోనే ఏకంగా రూ. కోటి గుల్ల చేశారు. బ్యాంక్ కేవైసీ, పాన్ స్కామ్ ద్వారా వివరాలను రాబట్టి.. హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. అయితే.. ఈ పాన్, బ్యాంక్ కేవైసీ వివరాలు ఎలా రాబట్టారో తెలుసా? గూగుల్ పే, ఫోన్ పే ద్వారా. అవును.. గూగుల్ పే, ఫోన్ పే గేట్ వే ద్వారా ఇటీవల సరికొత్త మోసానికి తెరతీశారు మోసగాళ్లు.

ఇక్కడ పెద్ద ట్రిక్కేం లేదు. చాలా సింపుల్. ఫ్రాడ్‌స్టర్లు.. Phone Pe, Google Pay గేట్ వేను ఉపయోగించి.. యూజర్ల అకౌంట్‌కు కొంత డబ్బులు పంపిస్తారు. తర్వాత ఏమీ ఎరగనట్లు మిస్టేక్‌లో మీ గూగుల్ పే లేదా ఫోన్ పే కు డబ్బులు వచ్చాయని, దయచేసి తిరిగి పంపించాలని అడుగుతారు. అరెరే నిజమే అనుకొని పొరబడి.. డబ్బులు పంపుతుంటారు చాలా మంది. అంతే.. ఈ ఒక్క చిన్న పొరపాటు ఖరీదు.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవ్వడమే. అవును వారి గూగుల్ పే, ఫోన్‌పే దేనికైనా రూ.10 నుంచి రూ.50,100 ఇలా ఎంత పంపినా సరే మాల్‌వర్ అటాక్‌కు గురవుతారు.

ఇదొక మాల్వేర్ ప్లస్ హ్యూమన్ ఇంజినీరింగ్ స్కామ్ అని చెప్పారు దిల్లీకి చెందిన సైబర్ క్రైం ఎక్స్‌పర్ట్ పవన్ దుగ్గల్. గూగుల్ Pay, ఫోన్ PE యూజర్లే టార్గెట్‌గా ఇలా చేస్తున్నారని చెప్పారు. పొరపాటున వచ్చిందని కాల్ చేసి, లేదా మెసేజ్ చేసే వారిని నమ్మొద్దని.. తిరిగి డబ్బులు పంపితే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వడం ఖాయమని చెప్పారు. ఒక్కసారి మీ సదరు కాల్ చేసిన వ్యక్తికి అలా డబ్బులు పంపితే పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లు సహా బ్యాంకింగ్ డీటెయిల్స్ మొత్తం వారికి చేరతాయని అంటున్నారు.

ఇక ఇలాంటి మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో కూడా చెప్పారు పవన్ దుగ్గల్. అలా పొరపాటున డబ్బులు మీ అకౌంట్‌కు వచ్చాయని ఎవరైనా కాల్ చేస్తే.. మీరు వేరే రెస్పాన్స్ ఇవ్వకుండా తమ బ్యాంక్ ఆ సమస్యపై దృష్టిసారిస్తుందని, తమకేం సంబంధం లేదని చెప్పాలంటున్నారు. లేదా.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి మీరు పంపిన డబ్బును తీసుకోవచ్చని చెప్పాలంటూ సూచిస్తున్నారు. అప్పుడు అది నిజమైనదేనా? లేదా ఫ్రాడ్ అనేది తెలుస్తుందని చెబుతున్నారు. అందుకే నిర్లక్ష్యంగా ఉండకుండా.. పొరపాటున డబ్బులు వస్తాయని ఎవరైనా చెబితే వెంటనే తిరిగి పంపొద్దని చెబుతున్నారు.ఈ రోజుల్లో చాలా మంది బయట చెల్లింపులు జరిపేందుకు ఈ యూపీఐ యాప్స్ వాడుతుంటారు కాబట్టి.. జాగ్రత్తగా ఉండండి.

Work From Home: 10 వేల మంది ఉద్యోగుల్ని పీకేసి టెక్ కంపెనీ ఇప్పుడు మరో కీలక ప్రకటన.. ఇక అది కుదరదంటూ!Greg Becker: బ్యాంకును ముంచేసి భార్యతో ఎంచక్కా ఫారెన్ చెక్కేసిన సీఈఓ.. అక్కడ లగ్జరీ ఇంట్లో!Indian Company: హాయిగా నిద్రపోండి.. ఆఫీసులకు రావొద్దు.. ఉద్యోగులందరికీ సర్‌ప్రైజ్ నిద్ర గిఫ్ట్..

  • Read Latest Business News and Telugu News

Related Articles

Back to top button