News

gold seized, ఎలా వస్తాయి బ్రో ఇలాంటి ఐడియాలు.. కోట్ల సరుకును మరీ అందులోనా..! – one crore worth gold caught in shamshabad airport from travellers socks


వీళ్లకు వచ్చే ఐడియాలతో మొత్తం దేశాన్నే దస్తీలో మడతపెట్టి జేబులో పెట్టుకుని దర్జాగా సముద్రాలు దాటేస్తారు. ఇది ఎవరిగురించో కాదు.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడ్డంగా దొరికిపోతున్న స్మగ్లర్ల గురించి బయట టాక్. ఎందుకంటే… ఈరోజు ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోట్లు విలువచేసే బంగారాన్ని అధికారులకు ఏమాత్రం దొరకకుండా.. వాళ్లు దాచిపెట్టిన తీరు చూస్తుంటే.. అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్, వీడెక్కడే సినిమాలో సూర్యలాగా.. స్మగ్లర్లు ఊహకు కూడా అందని రీతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే.. వాళ్లు ఎన్ని చావు తెలివితేటలు ఉపయోగించినా.. పోలీసులు నిఘా నేత్రాన్ని మాత్రం దాటి పోలేకపోతున్నారు. చిన్నగా అనుమానం వస్తే చాలు.. అణువణువూ చెక్ చేసి.. అడ్డంగా పట్టేసుకుంటున్నారు పోలీసులు.

అయితే.. ఈరోజు కూడా ఉదయం పూట ముగ్గురు ప్రయాణికులు రియాద్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ప్రయాణికుల కదలికలపై అనుమానం రావడంతో వెంటనే కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం వెతికినా ఏమీ దొరకలేదు. అయితే.. పోలీసులు కొంచెం హట్ కే సోంచాయించి.. మళ్లీ వెతకటంతో.. అసలు గుట్టు బయటపడింది. ఆ స్మగ్లర్లు కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా.. కోట్ల విలువైన బంగారాన్ని పేస్ట్‌గా చేశారు. అంతేకాదండోయ్ ఆ బంగారం పేస్టును కాళ్లకు వేసుకునే సాక్స్ లోపల పెట్టి షూస్ వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా ఎయిర్ పోర్ట్ దాటించే ప్రయత్నం చేశారు.

ఇంకేముంది పోలీసులు అన్నీ విప్పదీయటంతో.. లోపల దాచుకుందంతా బయటపడింది. దీంతో.. అధికారులు వెంటనే ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి.. కోటీ 13 లక్షల 13,558 విలువ గల 1818.98 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు ముగ్గురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు స్పెషల్ లోగో.. ఈ ప్రత్యేకతలు గమనించారా..?సూపర్ అంతే..!

ఇక చాలు రిటైర్మెంట్ తీసుకోండి.. వనమాపై డీహెచ్ శ్రీనివాస్ కౌంటర్

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button