godavarikhani singareni worker murder, స్కూల్‌మెట్‌తో ప్రేమ.. సింగరేణి కార్మికుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి! – police arrest three persons including deceased wife in singareni worker murder case in godavarikhani
టెక్నాలజీ సాయంతో, శాస్త్రీయ ఆధారాలతో నిందితులను పట్టుకున్నామని పెద్దపల్లి డీసీపీ రూపేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన రాజును ఈ కేసులో ఏ1గా చేర్చారు. రవళి తల్లి గారి ఊరికి చెందిన రాజు.. కిరాణా షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఏ2గా రాజు స్నేహితుడు సయ్యద్ పేరును చేర్చారు. ఏ3గా మృతుడు రాజేందర్ భార్య రవళి పేరును చేర్చారు.
‘‘బంధం రాజు, రవళి ఇద్దరూ పదో తరగతి వరకూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత రవళికి తన మేన బావ అయిన రాజేందర్‌తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏడాది క్రితం రవళి, రాజు ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలిశారు. తరచుగా మాట్లాడుకునే వారు. తర్వాత ఫోన్లు చేసుకునేవారు. ఈ క్రమంలోనే మళ్లీ చనువు పెరగడంతో.. నీ భర్తను వదిలేయి.. నిన్ను పెళ్లి చేసుకుంటానని రవళికి రాజు చెప్పాడు. రాజేందర్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. రాజుకు సయ్యద్‌తోపాటు నీలం శ్రీను, ఇమ్రాన్ తదితరులు సాయం చేశారు. రాజేందర్‌పై ఆరుసార్లు హత్యాయత్నం జరిగింది’’ అని పెద్దపల్లి డీసీపీ రూపేష్ తెలిపారు.
నిందితుల దగ్గరి నుంచి నుంచి తుపాకీ, 9 బుల్లెట్‌లు, మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామన్నారు.