News

go back cm, Visakhapatnam: ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’.. విశాఖలో పోస్టర్ల కలకలం! – go back cm sir poster in visakhapatnam


Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని.. తాను అక్కడికే షిఫ్ట్ అవుతానని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. జులై నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని.. ఇటీవల జరిగిన కేబినెట్‌లో కూడా YS Jagan Mohan Reddy ప్రస్తావించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొన్ని పోస్టర్లు కలకలం సృష్టించాయి.

గో బ్యాక్‌ సీఎం సార్‌.. రాజధాని అమరావతిని నిర్మించండి.. అంటూ విశాఖలో పోస్టర్లు వెలిశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో జన జాగరణ సమితి.. పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్‌ మెట్ట కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు వాటిని తొలగించారు.

విశాఖ నుంచి త్వరలో పరిపాలన కొనసాగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు నగరంలో కలకలం సృష్టించాయి. విశ్వవిద్యాలయ క్యాంపస్‌ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు అవకాశమున్న ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నవారిని.. అరెస్టు చేయాలని మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button