gill interview with dravid, ‘వారిద్దరూ ఔటయ్యేంత వరకు క్రీజ్‌లోనే ఉండు’.. గిల్‌కు రాహుల్ ద్రావిడ్ సలహా.. – rahul dravid key advice to team india opener shubman gill
గిల్‌ను దగ్గర్నుంచి గమనిస్తోన్న ద్రావిడ్.. ఇటీవలి కాలంలో అతడడి ఆటతీరులో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావించారు. గిల్‌తో ద్రావిడ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. అందులో ద్రావిడ్ ఏమన్నారంటే..
‘‘గత 6-8 నెలలుగా నీలో పరుగులు చేయాలనే ఆకలిని, మెచ్యూరిటీని గమనించాను. చిన్నప్పటి నుంచి నీకు బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ నువ్వు ఫీల్డింగ్ చేస్తున్న విధానం, స్లిప్‌లో క్యాచ్‌లు అందుకుంటున్న తీరును చూస్తే.. నీ అత్యుత్తమ ఆటతీరును బయటకు తేవాలని నువ్వు భావిస్తున్నట్లు అనిపిస్తోంది. అది నీలో వచ్చిన గొప్ప మార్పు’’ అని ద్రావిడ్ వ్యాఖ్యానించారు.
మిగతా ఆటగాళ్ల కంటే గిల్ ఆటను వేగంగా అర్థం చేసుకుంటాడని రాహుల్ తెలిపారు. తన పరిమితులను అర్థం చేసుకోవడం, సామర్థ్యాన్ని పెంచుకోవడంలో గిల్ సరైన మార్గంలో వెళ్తున్నాడని ద్రావిడ్ కితాబిచ్చారు.
గిల్ ఆటను ఎవరు చూసినా.. అతడు వయసుకు మించిన పరిణతి కనబరుస్తున్నాడని చెబుతారన్న ద్రావిడ్.. నీలో ఉన్న ఆకలి.. ఆటను అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించిన తీరు.. ఇన్నింగ్స్‌ను నిర్మిస్తోన్న తీరు గొప్పగా ఉందంటూ యువ ఓపెనర్‌పై హెడ్ కోచ్ ప్రశంసలు గుప్పించారు.
‘ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు (రోహిత్, కోహ్లి)తో కలిసి నువ్వు ఆడుతున్నావు. వన్డేల్లో వారిద్దరూ 250కిపైగా ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఫార్మాట్లో ఎలా ఆడాలనే విషయమై వారిద్దరి నుంచి సాధ్యమైనంత వరకు నేర్చుకో. రోహిత్, కోహ్లి ఇద్దరూ ఔటయ్యేంత వరకూ నువ్వు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించు’ అని గిల్‌కు ద్రావిడ్ సలహా ఇచ్చారు.
బంగ్లాదేశ్‌తో చివరి వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడంతో.. శ్రీలకంతో తొలి వన్డేకు తనను ఎంపిక చేస్తారని అనుకోలేదని.. కానీ రోహిత్, రాహుల్ ద్రావిడ్ తనపై నమ్మకం ఉంచి ఆడించారంటూ గిల్ వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపాడు. దీనికి స్పందించిన ద్రావిడ్.. మీ నాన్నగతంలో ఓ మాట చెప్పారు.. నీ బ్యాట్ నుంచి చిరు జల్లులు మాత్రమే వస్తున్నాయన్నారు. ఆయన కోరుకున్నట్టుగా ఇప్పుడు నీ బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది అన్నారు.