gilboa prison guard, ఖైదీలతో సెక్స్ చేయాలని అధికారులు ఒత్తిడి.. మహిళా గార్డు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ప్రధాని – woman guard alleged forced to work as sex slave in prison and probe ordered
అక్కడ ఖైదీలచే దాడికి గురయ్యే పరిస్థితుల్లో తప్పించుకోడానికి వారితో సెక్స్ చేయాలని మహిళా గార్డులను అక్కడ అధికారులు ఆదేశిస్తున్నారని ఇజ్రాయేల్ మీడియా ‘పింపింగ్ ఎఫైర్’ పేరుతో గతేడాది కథనాలు వెలువరించింది. గతవారం ఇదే అంశంపై గిల్బోవా జైలు మాజీ మహిళా వార్డు ఆన్లైన్లో తన గోడును వెళ్లబోసున్నారు. ఓ పాలస్తీనా ఖైదీ తనపై పదేపదే అత్యాచారం చేశాడని కన్నీటిపర్యంతమయ్యింది. తనను అతడికి తన ఉన్నతాధికారులే అప్పగించి, బానిసగా చేశారని వాపోయింది.
స్థానిక మీడియా ఛానెల్ 12లో బాధిత మహిళ తరఫున న్యాయవాది, కెరెన్ బరాక్ ఈ వాంగ్మూలాన్ని ధ్రువీకరించారు. అంతేకాదు తన క్లయింట్‌కు మానసిక ఆరోగ్య మద్దతు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ ప్రధాని యార్ లాపిడ్ తీవ్రంగా స్పందించారు. ఓ ఉగ్రవాది చేతిలో ఓ సైనికురాలు అత్యాచారానికి గురికావడాన్ని ముమ్మూటికీ క్షమించరానిదని ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్ఘాటించారు. ఈ ఘటనపై ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాల్సిందేనని, బాధితురాలికి అన్ని విధాలుగా సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు.
అలాగే, ఇజ్రాయేల్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఒమర్ బర్లేవ్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా గిల్బోవా జైలులో ఈ వ్యవహారం సాగుతోందని, ఇజ్రాయేల్ ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోతున్నారని అన్నారు. బాధితురాలికి జరిగిన అన్యాయం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. అలాగే, కేసుకు సంబంధించిన అంశాలు విచారణలో ఉన్నాయని, అయితే ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా తాను ప్రిజన్ సర్వీస్ కమిషనర్ కేటీ పెర్రీతో చర్చలు జరుపుతున్నానని చెప్పారు. ఇజ్రాయేల్‌పై దాడుల్లో పాల్గొని దోషులుగా తేలిన పాలస్తీనియన్లు ఉత్తర ఇజ్రాయేల్‌లోని గిల్బోవా జైలులో ఉంచుతారు.