News
ghmc to let board penalty, Hyderabad: టు లెట్ బోర్డు పెడుతున్నారా ?.. అయితే మీకో హెచ్చరిక ! – ghmc officials imposed a penalty for putting to-let board on the tree in jagadgiri gutta
అయితే టు లెట్ బోర్డు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు ఫెనాల్టీ విధిస్తుండటం పట్ల ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. జగద్గిరిగుట్టలో చెట్టుకు టు లెట్ పేపర్ అంటించిన ఓ ఇంటి యజమానికి జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 6 వేలు ఫైన్ విధించారు. గతంలోనూ జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం విభాగం అధికారులు ఓ ఇంటి గోడకు టు- లెట్ బోర్డు అంటించిన ఓ ఇంటి యజమానికి పెనాల్టీ విధించటం వివాదస్పదమైంది. అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. టు లెట్ బోర్డులు లేకుండా తమ ఇంటిని అద్దెకు ఇచ్చేది ఎలా ? అవసరమైన వారికి ఇల్లు ఖాళీ ఉందని తెలిసేది ఎలా ? అని ఇంటి యజమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరి ఇంటి ముందు వాళ్లు టు లెట్ బోర్డు పెట్టుకుంటే ఫర్వాలేదని అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పెడితేనే ఫైన్ విధిస్తున్నామని వెల్లడిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో టు- లెట్ బోర్డులు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని చెబుతున్నారు. ఈ విషయంపై నగరవాసులు అవగాహన కలిగి ఉండాలని అంటున్నారు.
- Read More Telangana News And Telugu News