News

Germany Recession: నేల చూపులు చూస్తున్న ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్ధ.. ఆర్ధిక మాంద్యంలోకి జర్మనీ.. – Telugu News | World’s Fourth Largest Economy Germany Enters Recession, GDP falls for second successive quarter


యూరోపియన్‌ యూనియన్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్ధగా ఉన్న జర్మనీ మాంద్యంలో చిక్కుకుంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో GDP క్షీణించడంతో జర్మనీ మాంద్యంలో కూరుకుపోయింది.

యూరోపియన్‌ యూనియన్‌లో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ ఆర్థిక మాంద్యం బారిన పడింది. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలకు అంతరాయం కలగడంతో జర్మనీలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో గృహవినియోగ డిమాండ్‌ క్షీణించింది. అయితే ఊహించిన దానికంటే ఈ మాంద్యం ప్రభావం తక్కువే ఉందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో జర్మనీ ఆర్థిక వృద్ధి 0.3 శాతానికి పడిపోయింది. 2022 చివరి త్రైమాసింలో ఇది 0.5 శాతంగా ఉంది. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు క్షీణిస్తే దాన్ని మాంద్యంగా పరిగణనిస్తారు.

ఇంధన ధరలు పెరగడంతో జర్మనీ ప్రజలు తల్లడిల్లుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి జర్మనీలో ఇంధన ధరలు కొండెక్కాయి. ఇంధనపరంగా జర్మనీ ఇప్పటికే ఎమర్జెన్సీ విధించింది.

మరో వైపు ద్రవ్యోల్బణం జర్మనీని అతలాకుతలం చేస్తుంటే పెట్టుబడుల్లో మాత్రం పెరుగుదల నమోదవతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022 రెండో అర్థభాగంలో పెట్టుబడులు తగ్గినా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి నమోదైంది. మెషీనరీ, పరికరాల్లో పెట్టుబడులు గత త్రైమాసికంతో పోల్చితే 3.2 శాతం పెరిగింది. నిర్మాణ రంగంలో 3.9 శాతం పెట్టుబడులు పెరిగాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button