Entertainment

Ram Charan: క్షమాపణలు చెప్పిన రాం చరణ్.. ఎందుకో తెలుసా?


Ram Charan: రాజమౌళీ, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతోపాటు అందులో నటించిన వారు, బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాటు నాటు అనే పాటకు స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రబృందం పలు కార్యక్రమాలకు అతిథులుగా హాజరవుతూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా భారత్‌లో జరిగిన జర్మన్ యూనిటీ డే వేడుకల్లోనూ ఈ సినిమా బృందం సందడి చేసింది.

జర్మనీ ఎంబసీ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హాజరయ్యారు. అయితే, రాంచరణ్‌కు ఆహ్వానం అందింది. కానీ, ఫ్యామిలీతో ఇటలీ వెళ్లారు. దీంతో ఋ వేడుకల్లో భాగం కాలేకపోయాడు. ఈమేరకు రాం చరణ్‌ జర్మనీ ఎంబసీ సిబ్బందికి వీడియో కాల్‌లో పలకరించారు. జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌కు హాజరుకాలేకపోయినందుకు క్షమాపణలు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో ప్రదర్శించిన నాటునాటు సాంగ్ కటౌట్‌ నాకెంతో నచ్చిందని అన్నారు. వీలు చూసుకుని అందర్నీ ఓసారి కలుస్తానంటూ హామీ ఇచ్చారు.

జర్మన్స్ తో వీడియో కాల్ మాట్లాడుతోన్న రాంచరణ్..

కాగా, ఈ వేడుకల్లో కీరవాణి తన పాటలతో అలరించారు. ముఖ్యంగా జర్మన్‌ భాషలో పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అనంతరం జర్మనీ ఎంబసీ సిబ్బందితో నాటునాటు పాటకు చిందులు వేశారు. ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

నాటు నాటు పాటకు డ్యాన్స్ వేస్తోన్న జర్మన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Related Articles

Back to top button