News

ganja in hyderabad, ‘పుష్పరాజ్‌’ను మించిపోయారుగా.. చిన్న టెక్నిక్‌తో దర్జాగా 200 కిలోల గంజాయి తరలింపు – hyderabad police held three and seized 200 kg of ganja worth 60 lakhs


స్మగ్లింగ్‌లో మనోళ్లు పుష్పరాజ్‌ను మించిపోతున్నారు. వీళ్లను చూస్తే పుష్పరాజ్ కూడా తగ్గాల్సిందే అనేలా స్మగ్లింగ్ చేస్తున్నారు. కానీ.. స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేసినా.. మన పోలీసులు వాళ్లకంటే తెలివిగా చిత్తు చేస్తూ.. కటకటాలకు పంపిస్తున్నారు. ఈ నేఫథ్యంలోనే హైదరాబాద్‌లో హెచ్ న్యూ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏకంగా 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 60 లక్షల విలువ గల గంజాయిని ఎవ్వరికీ కనిపించకుండా.. డీసీఎంలో రహస్యంగా తరలిస్తున్నారు.

అయితే.. పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే తనిఖీలు నిర్వహించగా.. అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమాలో హీరో పాల వ్యానులో గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసిన టెక్నిక్‌నే వీళ్లు కూడా ఉపయోగించారు. అయితే.. వీళ్లు మాత్రం అతితెలివితో.. డీసీఎం బాడీని రీడిజైనింగ్ చేసి బయటికి కనిపించకుండా రహస్యంగా బాక్సుల్లాంటి ఏర్పాట్లు చేశారు. వాటిలో గంజాయిని దాచిపెట్టి దర్జాగా నగరాన్ని దాటిస్తుండగా.. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ల గుట్టును బట్టబయలు చేశారు. పోలీసులు ముగ్గురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 60 లక్షల రూపాయల విలువ గల 200 గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

‘తాతగారూ మీరు ఇంకా ఉన్నారా..’ వీహెచ్‌ను ఆర్జీవీ పుసుక్కున అంతమాట అనేశాడేంటీ..?

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button