News

gadala srinivasa rao, ‘ఇక చాలు.. 4 నెలల్లో అంతా సెట్ చేస్తా’.. డీహెచ్ శ్రీనివాస్ పక్కా పొలిటికల్ కామెంట్స్ – telangana health director srinivasa rao comments on kothagudem mla vanama venkateshwar rao


తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కున్న శ్రీనివాసరావు.. ఇప్పుడు ఏకంగా పొలిటికల్ కామెంట్స్ చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర్‌ రావు, ఆయన కొడుకు వనమా రాఘవ రావుకు డీహెచ్ శ్రీనివాస్ రావు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లోనే.. ఇదే లాస్ట్ ప్లీజ్ ఒక్కసారి అంటూ ఓట్లు అడిగారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 80 ఏళ్లు వచ్చాయని.. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని హితవు పలికారు. మంచి చేయడానికి వస్తే అడ్డుకుంటారా.. అంటూ ప్రశ్నించారు. మంచి చేయాలనుకునే వారిని అనుసరించాలనుకునే వారిని అడ్డుకోవడం ఏం నీతి అంటూ నిలదీశారు. అందరినీ ఫోనలో బెదిరిస్తన్నారంటూ కీలక ఆరోపణలు చేశారు.

ఆదివాసీ ప్రాంతాల్లో తన తండ్రీ 50 ఏళ్లు ఆయుర్వేదిక్ డాక్టర్ తిరుగుతూ సేవ చేసేవారని డీహెచ్ చెప్పుకొచ్చారు. ఆదివాసీలు తమను గుండెల్లో పెట్టుకున్నారని.. వారి రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇంకా ఎంత కాలం బెదిరిస్తారని గడల ప్రశ్నించారు. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే అనే సుమతి శతకాన్ని వినిపించారు. మరో 4 నెలలు ఓపిక పట్టండి అన్ని సెట్ అవుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గడల ప్రోగ్రాంకు వెళితే పదవి పీకేస్తా, దళిత బంధు ఆపుతా… అది చేస్తా ఇది చేస్తా అనే బెదిరింపులు ఇంకెన్నాళ్లు.. ఇంక ముందు అలాంటి బెదిరింపు సాగవన్నారు. తనకు వారసుల్లేరని.. తనకు ఇక్కడి పిడికెడు మట్టి కూడా అవసరం లేదన్నారు. ఉల్వనూరులో ఇల్లు కట్టుకుంటామని.. తన శరీరం ఇక్కడి మట్టిలో కలిసిపోతుందని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కొత్త కొత్తగూడెంను చూద్దామని.. మీరంతా తమతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సభికులను ప్రశ్నించారు.

ఇప్పటికే.. డీహెచ్ శ్రీనివాస రావు కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే.. నాలుగు నెలలు ఓపిక పట్టండి.. కొత్త కొత్తగూడెం చూస్తామంటూ కామెంట్స్ చేయటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ ఫ్యామిలీ

లవర్ మోసం చేసిందన్న కోపంతో.. జీవితాంతం గుర్తుండేలా ఆమె బర్త్‌‌డే రోజున…!

  • Read More Telangana News And Telugu News

Related Articles

Back to top button