News

G20 Tourism Summit: శ్రీనగర్‌లో రేపటి నుంచి జీ20 టూరిజం సదస్సు.. భారీ ఉగ్రకుట్రను భగ్నం.. – Telugu News | G20 Tourism in Srinagar: 26/11 type attack plot exposed, Kashmir plan of G20 delegates tweaked


జమ్ముకశ్మీర్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ20 టూరిజం సదస్సుపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌తో పాటు సందర్శించే ప్రాంతాల దగ్గర కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లో జీ20 టూరిజం సదస్సుకు ముందు భారీ ఉగ్రకుట్ర బయటపడింది. గుల్‌మార్గ్‌లో విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌ను

జమ్ముకశ్మీర్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ20 టూరిజం సదస్సుపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌తో పాటు సందర్శించే ప్రాంతాల దగ్గర కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లో జీ20 టూరిజం సదస్సుకు ముందు భారీ ఉగ్రకుట్ర బయటపడింది. గుల్‌మార్గ్‌లో విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌ను టెర్రరిస్టులు టార్గెట్‌ చేసినట్టు నిఘావర్గాలు పసిగట్టాయి. దీంతో జీ 20 టూరిజం ప్రతినిధుల బస చేసే హోటల్‌ వేదికను మార్చారు. గుల్‌మార్గ్‌ నుంచి వేరే ప్రాంతానికి వేదికను మార్చారు.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర..

గుల్‌మార్గ్‌లో ముంబై తరహా దాడులు చేయాలని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. శ్రీనగర్‌లో సోమవారం , మంగళవారం జీ20 సదస్సు జరుగుతుంది. దాదాపు 60 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే జీ20 సదస్సును భగ్నం చేయడానికి ఐఎస్‌ఐ సంస్థ కుట్ర చేసింది.

దాల్‌ సరస్సులో కమెండోలతో భద్రత..

ఐఎస్‌ఐ కుట్ర బయటపడడంతో శ్రీనగర్‌లో జీ20 వేదిక దగ్గర భద్రతను పెంచారు. ప్రతినిధులు పర్యటించే దాల్‌ సరస్సులో కమెండోలతో భద్రతను ఏర్పాటు , జమ్ములో కూడా భద్రతను పెంచారు. చినాబ్‌ నదిలో కూడా మెరైన్‌ కమెండోలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి



జీ20 దేశాల ప్రతినిధులపై ఆత్మాహుతి దాడికి కుట్ర..

కశ్మీర్‌కు వచ్చే జీ20 దేశాల ప్రతినిధులపై ఆత్మాహుతి దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి మూడు చోట్ల దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. డ్రోన్లతో , సీసీటీవీలతో శ్రీనగర్‌లో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌లో జీ20 సదస్సును కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా సదస్సును సక్సెస్‌ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button