News

foreign coal purchase tender, APGENCO బొగ్గు టెండర్ అదానీకే.. ప్రభుత్వంపై రూ.300 కోట్ల అదనపు భారం.. అంతిమ లక్ష్యం అదేనా? – apgenco foreign coal purchase tender was awarded to adani group


Foreifn Coal Purchase Tender: మరో పెద్ద బొగ్గు టెండర్ అదానీ గ్రూప్‌కు చిక్కింది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి అవసరమైన 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు (Foreign Coal Tender) రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (GENCO) గత జనవరిలో టెండర్ కోసం ప్రకటన జారీ చేసింది. అదానీ సంస్థతో సహా MBS, చెట్టినాడ్, తరుణ్, ఆది సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. తొలి ప్రైస్ బిడ్‌లో చెట్టినాడ్ సంస్థ L1 గా నిలిచింది. తర్వాత అదానీ సంస్థ రివర్స్ టెండరింగ్ ద్వారా మరింత తక్కువ ధరకే.. కోట్‌ చేసి టెండర్‌ను సొంతం చేసుకుంది. బొగ్గు టన్నుకు రూ.13,100కు కోట్ చేసి.. L1 గా నిలిచింది. దీంతో అదానీ సంస్థతోనే అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

జెన్‌కో.. దేశీయ బొగ్గును రూ.5 వేలకే కొంటోంది. దీని గ్రాస్ కెలోరిఫిక్ విలువ (GCV) సుమారు 4 వేల రూపాయలుగా ఉంది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కోల్ జీసీవీ 6,500 వరకు ఉంటుంది. ఇక చెల్లించే ధరతో చూస్తే.. పెరిగే జీసీవీ తక్కువే అయినప్పటికీ.. 162 శాతం ఎక్కువ మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలనే ప్రభుత్వం నిర్ణయించుకుంది. విదేశీ కోల్ టన్నుకు రూ.9 వేలకు మించి కొంటే భారమని నిపుణులు చెబుతున్నారు. బొగ్గు కొనుగోలు కోసం ప్రభుత్వం ఇప్పుడు రూ.982.50 కోట్లు ఖర్చు చేస్తోంది. దీంతో ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది.

AP ప్రజలకు గుడ్‌న్యూస్.. విశాఖ, కడప సహా ఆ ప్రాంతాల్లో Adani Group భారీ పెట్టుబడులు

థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కోసం దేశీయ బొగ్గులో 6 శాతం వరకు విదేశీ బొగ్గు కలపాలని, ఇక దేశంలో బొగ్గుకు కొరత దృష్ట్యా మరో 9 నెలల పాటు సంస్థలు సర్దుబాటు చేసుకోవాలని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ గతంలో సూచించింది. APGENCO .. 10 లక్షల టన్నుల బొగ్గు కొనాలని తొలుత భావించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ ఎన్నో ప్రాజెక్టుల్ని సొంతం చేసుకుంది. పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్ట్స్, సౌరవిద్యుత్ ప్రాజెక్ట్‌లు సహా.. ఇప్పటికే రాష్ట్రంలో రెండు పోర్టులను నిర్వహిస్తోంది అదానీ గ్రూప్.

ఇక ఇప్పుడు కడప, నడికుడిలో సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఇటీవల ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అదానీ గ్రూప్ ప్రకటించింది. విశాఖపట్టణంలో డేటా సెంటర్ సహా పోర్టుల సామర్థ్యాన్ని రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణను కూడా అదానీకే అప్పగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

NIFTY 50 Index: అప్పులు కట్టినా.. నిఫ్టీ సూచీల్లో అదానీ గ్రూప్ షేర్లు మాయం.. తొలగించిన NSE

GQG Partners: అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం.. బ్లాక్ డీల్స్ చేసిన దిగ్గజ కంపెనీ మరోసారి ఇన్వెస్టర్లకు భరోసా!

  • Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button