Entertainment

Sreeleela: చిక్కుల్లో పెళ్లి సందD హీరోయిన్.. శ్రీలీల తల్లిపై కేసు నమోదు..


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో… ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల తల్లిపై బెంగుళూరులో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమె భర్త సుభాకర్ రావు దాఖలు చేసిన ఫిర్యాదుతో ఆడుగోడి పోలీస్ స్టేషన్‎లో శ్రీలీల తల్లి స్వర్ణలతపై కేసు నమోదైంది. సుభాకర్ రావు వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న స్వర్ణలత.. మనస్పర్థలు రావడంతో భర్తకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె తన కూతురు శ్రీలీలతో కలిసి నివసిస్తుంది. అయితే స్వర్ణలత.. సుభాకర్ విడాకుల పిటిషన్ పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 3న కోరమంగళలోని తన అపార్ట్‏మెంట్‏లోకి స్వర్ణలత తాళం పగలకొట్టి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కోన్నారు సుభాకర్ రావు.

మరోవైపు ఇప్పటికే శ్రీలీల తల్లి ఓ కేసులో నిందితురాలిగా ఉంది. అలయన్స్ యూనివర్సిటీలో వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్‏లో ఆమెపై ఏ2 కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెపై మరో కేసు నమోదైంది.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో… ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ధమాకా చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button