News
Festivals in January: ఈ నెలలో సంక్రాంతి సహా పలు ముఖ్యమైన పండగలు.. ఏ ప్రాంతాల్లో ఏ పండగలను జరుపుకుంటారో తెలుసా | Festivals in january 2023 celebrate the start of the year with these festivals in telugu
భారతదేశం భిన్నమైన సంస్కృతుల సంగమం. అనేక రకాల భౌగోళిక వైవిధ్యం, చరిత్ర, సంప్రదాయాలకు నెలవు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో సంవత్సరం ప్రారంభాన్ని సంతోషంగా జరుపుకోవడానికి కొన్ని ప్రత్యేక రోజులు గురించి తెల్సుకుందాం

Festivals In Januar 1
- భారతదేశం భిన్నమైన సంస్కృతుల సంగమం. అనేక రకాల భౌగోళిక వైవిధ్యం, చరిత్ర, సంప్రదాయాలకు నెలవు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో సంవత్సరం ప్రారంభాన్ని సంతోషంగా జరుపుకోవడానికి కొన్ని ప్రత్యేక రోజులు గురించి తెల్సుకుందాం
- బికనీర్ ఒంటెల పండుగ (జనవరి – 12): రాజస్థాన్లో ఫేమస్ పండగ ఒంటెల పండుగ. రాజస్థాన్ పర్యాటక శాఖ ప్రతి సంవత్సరం బికనీర్లో ఈ ఒంటెల పండుగను నిర్వహిస్తుంది.
Advertisement
- లోహరి ఉత్సవ్ (జనవరి-13): దేశంలోని వివిధ ప్రాంతాల్లో పంట తమ ఇంటికి వస్తున్నందుకు ఆనందానికి గుర్తుగా లోహరిని జరుపుకుంటారు. రాత్రిపూట భోగి మంటలు వేసి.. నువ్వులు, బెల్లం సమర్పించే పండుగను .. ఉత్తరాదిలో వివిధ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
- మకర సంక్రాంతి (జనవరి- 14): భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఇది పంటల పండుగ. ఇది వేసవి కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. కేరళలోని శబరి గిరుల్లో ఈ రోజు కూడా చాలా ప్రత్యేకమైన రోజు
- కెందులి మేళా (జనవరి 14-17): పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ ప్రాంతంలో జరిగే ఈ మూడు రోజుల పాటు జరిగే ఉత్సవం. చాలా మంది కళాకారుల భక్తి గీతాలను ఆలపిస్తారు. గొప్ప కవి కెందులి పేరుతో నిర్వహించే ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
- పొంగల్ (జనవరి 15): తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన పంట పండుగలలో పొంగల్ ఒకటి. పొంగల్ పంటకు ప్రతీక. వరి, చెరకు, దావా ధాన్యం వంటి పంటలను ఇంటికి తీసుకురావడానికి ఇదే సరైన సమయం. పొంగల్ రోజున పాలతో అన్నం వండి వడ్డిస్తారు. పాయసాన్ని సూర్యుడికి నైవేద్యంగా పెడతారు.
- బిహు ఉత్సవం (జనవరి 15): అస్సాంలో బిహు పండుగను ఎంతో ఉత్సాహంగా.. వైభవంగా జరుపుకుంటారు. పండుగ అనేక కార్యక్రమాలతో నిండి ఉంటుంది. ఈ పండగను అన్ని మతాలు, కులాల వారు కలిసి పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా, బిహు నృత్యం ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది.
- జైపూర్ సాహిత్య ఉత్సవ్ (జనవరి 19): జైపూర్ సాహిత్య ఉత్సవ్ దేశంలోని సాహిత్య ప్రియులందరికీ ఇష్టమైన పండుగ. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రచయితలు, వక్తలు, వినోదకారులు వంటి విభిన్న నేపథ్యాల నుండి ప్రజలు తమ అభిప్రాయాలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఆసక్తికరమైన చర్చలు కూడా నిర్వహించబడతాయి.
- మోధేరా డ్యాన్స్ ఫెస్టివల్ (జనవరి 19): ఈ గొప్ప ఉత్సవం గుజరాత్లోని మోధేరా ఆలయంలో సోలంకి రాజ్యం వైభవాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి సంవత్సరం, ఆలయంలో నృత్యోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ నృత్యకారులు, సంగీతకారులు , గాయకులు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. కళ, సంగీతం, నృత్య రంగాలలో ఈ ప్రాంతం ప్రతిభను ప్రదర్శించడానికి ఈ ఉత్సవం గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.