News

Father Raped Daughter,11 ఏళ్ల కన్నకూతురిపై అత్యాచారం.. కీచక తండ్రికి కఠిన శిక్ష విధించిన కోర్టు – nampally court sentenced to 25 years imprisonment to father for raped his daughter in hyderabad


కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన కీచక తండ్రికి శిక్ష వేస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు. రక్తం బంధాన్ని మరిచి పశువు కంటే నీచంగా ప్రవర్తించిన ఆ తండ్రికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. కాగా.. తల్లి ఇంట్లో లేని సమయంలో 11 ఏళ్ల తన సొంత కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి చెప్పొదదని బెదిరించాడు. దీంతో.. బయపడిన చిన్నారి విషయాన్ని ఎవరితో చెప్పలేదు. కానీ.. చిన్నారి తీవ్రమైన కడుపునొప్పితో విలపిస్తుండగా.. గమనించిన తల్లి గట్టిగా నిలదీసింది.

ఇక అప్పుడు తన కీచక తండ్రి గురించి బయటపెట్టింది ఆ చిన్నారు. తనపై తండ్రి బలాత్కారానికి పాల్పడ్డాడని తల్లికి చెప్పింది. దీంతో.. వెంటనే ఆమె చాంద్రయణగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొదట చిన్నారిని వెంటనే భరోసా సెంటర్‌కు తరలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై 376(2)(f)(n), 506 IPS r/w 6 పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత.. అమ్మాయి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన పోలీసులు.. ఆధారాలు సేకరించారు. నిందితుడిని సాక్ష్యాలతో సహా న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. నేరం రుజువు కావడంతో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

చావడానికైనా, చంపడానికైనా భయపడను.. సొంత పార్టీ కార్యకర్తలకు రాజాసింగ్ ధమ్కీ

Related Articles

Back to top button