News

father kills daughter, నచ్చలేదు.. కన్నకూతురినే చంపేసిన తండ్రి, విశాఖలో దారుణం – father kills 16 year old daughter in visakhapatnam


విశాఖపట్టణం నగరం రెల్లి వీధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. కూతురు ప్రవర్తన నచ్చలేదని కన్నతండ్రే ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహం ముందు నిలబడి సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కూతురు ప్రవర్తన నచ్చకనే ఆమెను కడతేర్చినట్లు చెప్పాడు. తనను అల్లారు ముద్దుగా పెంచుకున్నానని, తనకే ఎదురు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలిక వయస్సు 16 ఏళ్లు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వడ్డాది వరప్రసాద్ (42) అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ.. విశాఖ రెల్లి వీధిలో తన కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. వీరితో పాటు వరప్రసాద్ తండ్రి కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వరప్రసాద్ భార్య హేమలత 13 ఏళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. నాటి నుంచి వరప్రసాద్ తన ఇద్దరు కుమార్తెలను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

కొంత కాలం కిందట పెద్ద కుమార్తె ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది. నాటి నుంచి చిన్న కుమార్తెను ప్రాణంగా చూసుకుంటున్నాడు. 3 రోజుల కిందట చిన్న కుమార్తె లిఖిత కూడా ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుమార్తె కనిపించడంలేదని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడు, కుమార్తె (ఫైల్ ఫొటోలు)

వరప్రసాద్ చిన్న కుమార్తె 3 రోజుల కిందట ఓ యువకుడితో వెళ్లిపోయిందని అతడి తండ్రి చెబుతున్నారు. శుక్రవారం (నవంబర్ 4) మధ్యాహ్నం ఆ అమ్మాయిని వరప్రసాద్ తిరిగి ఇంటికి పిలిపించాడు. అనంతరం ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ బాలిక తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో తండ్రినే ఎదురించి మాట్లాడినట్లు అనుమానిస్తున్నారు.

కుమార్తె తీరుతో కోపోద్రోకానికి గురైన వరప్రసాద్.. కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో తీశాడు. తన తల్లి విజయలక్ష్మి చనిపోయిన రోజునే తన కుమార్తెను చేతులారా చంపుకున్నానంటూ వీడియోలో వరప్రసాద్ ఒకింత బాధగా చెప్పాడు. వీడియో వైరల్ అవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వరప్రసాద్ మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవగా.. సరిగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.

NTR: ‘వెన్నుపోటు’పై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
పనిమనిషి బర్త్‌డే.. సర్‌ప్రైజ్ చేసిన కుటుంబం, ఎంత ఆనందం!

Advertisement

Related Articles

Back to top button