Veera Simha Reddy: ఉప్పొంగిన అభిమానం.. బాలయ్య కటౌట్‌కు మ్యాన్సన్ హౌస్ మద్యంతో అభిషేకం
వీరసింహారెడ్డి అదరగొడుతున్నాడు. వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో సందడి చేస్తున్నాడు. బాలయ్య మాస్ మసాలా డైలాగ్స్, యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈలలు, కేకలతో సందడి నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో జై బాలయ్య అంటూ హొరెత్తిస్తున్నారు.

veera simha reddy release
వీరసింహారెడ్డి జాతర మొదలైపోయింది. బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. తెల్లవారుజామున 4గంటల నుంచే స్పెషల్ షోలు ప్రారంభమయ్యాయి. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు బాలకృష్ణ. ఆయన ఫ్యాన్స్ ఈలలు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ఈ సినిమాతో బాలయ్యబాబు మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారంటున్నారు ఫ్యాన్స్. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పైగా సంక్రాంతి..బాలయ్యకు బాగా అచ్చొచ్చిన పండగ. గతంలో ఇదే పండక్కి వచ్చి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు బాలకృష్ణ. ఇప్పుడు కూడా మోత మోగడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు విభిన్న రూపాల్లో బాలయ్యపై తమ అభిమానం చాటుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో.. పోట్టేలు రక్తంతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం చేశారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ కటౌట్‌కు మ్యాన్సన్ హౌస్ మద్యంతో అభిషేకం చేశారు అభిమానులు. ఇక పాలాభిషేకాలు, క్రాకర్స్ పేల్చడాలు, గజమాలలు, మేళతాలాలు, భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, కొబ్బరికాయలు కొట్టడాల గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గాడ్ ఆఫ్ మాసస్ బాలయ్య అంటూ చెలరేగిపోతున్నారు ఫ్యాన్స్.
అటు ఓవర్సిస్లోనూ అంతే సందడి ఉంది. న్యూజెర్సీలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. జై బాలయ్య అంటూ హంగామా చేశారు. బాలయ్యబాబు సినిమా ఫ్యాన్స్ అందరికీ డబుల్ పండుగ అంటున్నారు. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా అంటూ హంగామా చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఉందని..మహిళా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని అంటున్నారు. బాలయ్య బాబు సినిమా అంటే తనకు పిచ్చి అంటున్నారు ఎన్ఆర్ఐలు. సీనియర్ బాలయ్య యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు. బే ఏరియాలో డప్పులతో భారీ ర్యాలీలు నిర్వహించారు. బాలయ్య బాబు కటౌట్‌కు పాలాభిషేకాలు చేశారు. బాణాసంచా కాలుస్తూ హంగామా చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..