Entertainment

Mahesh Babu-Pawan Kalyan: మహేష్‌తో మొదలైంది.. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్


సూపర్‌ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు మహేష్. ఇక మహేష్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి.

Mahesh Babu-Pawan Kalyan: మహేష్‌తో మొదలైంది.. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

Mahesh Babu , Pawan Kalyan

Rajeev Rayala

Advertisement

Rajeev Rayala |

Aug 02, 2022 | 7:41 PM
సూపర్‌ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు మహేష్. ఇక మహేష్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇక మహేష్  బర్త్‌ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్‌. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో మరింత క్వాలిటీగా 4 కే వర్షన్‌ను దేశ విదేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 9న వేసే స్పెషల్‌ షోకు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. మహేష్ మూవీ జోరు చూసిన పవర్‌ స్టార్(Pawan Kalyan) ఫ్యాన్స్‌.. పవన్‌ బర్త్‌డేను కూడా ఇదే రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవర్‌ స్టార్‌ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీ జల్సా సినిమాను రీ మాస్టర్డ్ వర్షన్‌ రిలీజ్ చేయాలంటూ ఆ సినిమా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

మహేష్ బర్త్‌ డే విషయంలో చాలా ముందు నుంచే హడావిడి మొదలైంది. పోకిరి రీ రిలీజ్ విషయంలోనూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌. కానీ పవన్ మూవీ విషయంలో మాత్రం ఆ సందడి కనిపించటం లేదు. సెప్టెంబర్ 2న పవర్‌ స్టార్ బర్త్‌ డే. ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నా.. రీ రిలీజ్‌లకు సంబంధించిన ప్రకటనలేవి ఇంతవరకు రాలేదు. మరి అభిమానుల డిమాండ్‌ తరువాతైన అలాంటి ఎనౌన్స్‌మెంట్ ఏదైనా వస్తుందేమో చూడాలి. ఇక ఇండస్ట్రీలో పవన్ మహేష్ క్రేజ్ మాములుగా ఉండదు. ఈ ఇద్దరు హీరోల్లో చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి. ఇద్దరు చాల సింపుల్ గా ఉంటారు. అదే ఈ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మరి పవన్ సినిమా పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button