News

Extramarital Affair: వీళ్లకేమైంది.. ఆ యాప్‌లో ఏకంగా 2 మిలియన్లమంది.!వివాహేతర బంధాల కోసం ఎగబడుతున్నరు.. | 2 million Indians are in extramarital dating app Telugu viral video


ఇది నిజంగా షాకింగ్ విషయమే.. తమకు పెళ్లి అయినా.. ఇతరుల పట్ల వ్యామోహంతో రెచ్చిపోతున్నారు స్త్రీ, పురుషులు ఇరువురు. కొత్త బంధం కోసం ఏ ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన వివాహేతర సంబంధాలకు చెందిన..


ఇది నిజంగా షాకింగ్ విషయమే.. తమకు పెళ్లి అయినా.. ఇతరుల పట్ల వ్యామోహంతో రెచ్చిపోతున్నారు స్త్రీ, పురుషులు ఇరువురు. కొత్త బంధం కోసం ఏ ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన వివాహేతర సంబంధాలకు చెందిన ఎక్స్‌ట్రా మారిటల్ డేటింగ్ యాప్‌ ‘గ్లీడెన్’ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ యాప్‌ సబ్‌స్క్రైబర్స్ 10 మిలియన్ల మార్క్ దాటింది. అయితే, ఇందులో వింతేముంది? అని మీరనుకోవచ్చు.. కానీ ఈ 10 మిలియన్ల మందిలో ఒక్క మన భారతదేశం నుంచే 2 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదండోయ్.. సెప్టెంబర్ 2022 నుంచి 11 శాతం ఇండియన్ సబ్‌స్క్రైబర్స్ పెరిగినట్లు సంస్థ ప్రకటించింది. కొత్త సబ్‌స్క్రైబర్‌లలో 66శాతం మంది టైర్ 1 నగరాల నుండి వచ్చారని, మిగిలినవారు టైర్ 2, టైర్ 3 నగరాల నుండి వస్తున్నారని కంపెనీ తెలిపింది.ఈ యాప్‌ను ప్రత్యేకంగా వివాహితుల కోసమే రూపొందించారు. ఇందులో పెళ్లి అయిన వారు మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లెక్కన 2 మిలియన్ల మంది భారత్‌కు చెందిన స్త్రీ, పురుషులు సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ధనవంతులు, ఉన్నత ఉద్యోగులు, ఇంజనీర్లు ఉంటారని కంపెనీ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Advertisement

Related Articles

Back to top button