News

Elon Musk: ట్విట్టర్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. ఎలాన్ మస్క్‌కు థాంక్స్ చెబుతున్న నెటీజన్లు – Telugu News | Elon Musk’s Twitter to get another feature similar to YouTube


Aravind B

Aravind B |

Updated on: May 22, 2023 | 5:10 AM

ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక పలు మార్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వచ్చేవారంలో మరో రెండు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నామని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలకు 15 సెకన్ల ఫార్వర్డ్, బ్యాక్ బటన్లు కూడా జత చేయాలని కోరుతూ ఓ నెటిజన్ ట్వీట్ చేసి.. ఎలాన్ మస్క్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు.

Elon Musk: ట్విట్టర్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. ఎలాన్ మస్క్‌కు థాంక్స్ చెబుతున్న నెటీజన్లు

Elon Musk


ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక పలు మార్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా వచ్చేవారంలో మరో రెండు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నామని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలకు 15 సెకన్ల ఫార్వర్డ్, బ్యాక్ బటన్లు కూడా జత చేయాలని కోరుతూ ఓ నెటిజన్ ట్వీట్ చేసి.. ఎలాన్ మస్క్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు. అయితే దీనిపై మస్క్ స్పందించారు. వచ్చేవారం పిక్-ఇన్-పిక్ మోడ్‌ తోపాటు వీడియో ఫార్వార్డ్, బ్యాక్ బటన్లు వస్తాయంటూ ట్వీట్ చేశారు.

Advertisement

అయితే పిక్-ఇన్-పిక్ మోడ్ సాయంతో యూట్యూబ్ తరహాలో నెటిజన్లు చిన్న విండోలో వీడియో వీక్షిస్తూనే వెబ్ పేజీలో తమ పని చేసుకోవచ్చు. అలాగే ఫార్వర్డ్ లేదా బ్యాక్ బటన్ సాయంతో వీడియోను ముందూ వెనుకకు కూడా జరపవచ్చు. ప్రస్తుతం వాట్సాప్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి. ఎలన్ మస్క్ ట్వీట్ చూశాక చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇలాంటి ఫీచర్ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని, వీటిని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button