News

DVC Recruitment 2022: కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..


భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన ఓవర్‌మ్యాన్, మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

DVC Recruitment 2022: కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

DVC Kolkata Recruitment 2022

భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్.. ఒప్పంద ప్రాతిపదికన 12 ఓవర్‌మ్యాన్, మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మైనింగ్‌ ఇంజనీరింగ్‌/మైన్‌ సర్వేయర్‌లో డిప్లొమాతోపాటు వ్యాలిడ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్ కూడా ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 9, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.42,000ల నుంచి రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Advertisement

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button