Entertainment

Dulquer Salmaan: ‘సెట్స్‌లో మృణాల్‌ని చూస్తే అలా అనిపించేది’.. దుల్కర్ ఆసక్తికర కామెంట్స్


ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో సీతారామం సినిమా ఒకటి. అందమైన ప్రేమకథగా రానున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హనురాఘవాపుడి దర్శకత్వంలో..

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఏవైటెడ్ మూవీస్ లో సీతారామం సినిమా ఒకటి. అందమైన ప్రేమకథగా రానున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటిస్తున్నారు. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ ఇలా స్టార్ కాస్ట్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. అసలు ప్రేక్షకుల నుండి వస్తున్న ఈ రెస్పాన్స్ ని ఊహించలేదు. వారి ప్రేమకి కృతజ్ఞతలు అన్నారు. ‘సీతారామం’ చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. సీతారామం అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే. రోజురోజుకి నా వయసు కూడా పెరుగుతుంది కదా.. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ వుంది. ఫ్రెష్ , ఒరిజినల్ గా వుండే పాయింట్ల ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. కానున్న కళ్యాణం పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా వుంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. తెలుగు అద్భుతమైన భాష. పాటల్లో ప్రతి వాక్యం భావం తెలుసుకున్నాను

రామ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తా. రామ్ ఒక అనాధ. రామ్ కి దేనిపైనా ద్వేషం వుండదు. వెరీ హ్యాపీ, పాజిటివ్. అతనికి దేశభక్తి ఎక్కువ. అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్ అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్శన్. చాలా పాజిటివ్ గా వుంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా వుంటుంది. నా కోసం ది బెస్ట్ ని ఎంపిక చేస్తారు. దర్శకుడు హను ఈ కథని అద్భుతంగా ప్రజంట్ చేశారు. ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలని ఇలా ఉంటాయేమోనని ఇమాజిన్ చేసుకుంటాం. ‘సీతారామం’ కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా లానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇక ఆఫ్ స్క్రీన్ కూడా తను హ్యాపీ,  ఎనర్జిటిక్ పర్శన్. ఇక ఇందులో కొత్త రష్మిక ని చూస్తారు. ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. సీతారామంలో రష్మిక గ్రేట్ ఎనర్జీ అంటూ ఆకాశానికెత్తేశారు దుల్కర్.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి

Advertisementలేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Articles

Back to top button