doni name on bat, WPL: స్పాన్సర్లు లేరని.. బ్యాట్‌పై ధోనీ పేరు రాసుకొని.. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన యూపీ బ్యాటర్ – up warriors star kiran navgire writes msd 07 on her bat and scores 50 against gujarat gaints
కిరణ్ బ్యాట్‌పై స్పాన్సర్ లేబుల్స్ లేవు. దీంతో ఆమె తన బ్యాట్‌పై ‘MSD 07’ అని స్కెచ్‌తో రాసుకుంది. గుజరాత్ గెయింట్స్ బౌలర్లపై నవగిరే ఎదురు దాడి చేస్తున్నప్పుడు కామెంటేటర్.. ఆమె బ్యాట్‌పై ఉన్న అక్షరాలను గుర్తించారు. తన బ్యాట్‌పై ధోనీ పేరు, అతడి జెర్సీ నంబర్ 07ను రాసుకున్న ఈ మహారాష్ట్ర క్రికెటర్ తాను ధోనీకి ఏకలవ్య శిష్యురాలినని చెప్పకనే చెప్పింది. తాను ధోనీని ఫాలో అవుతానని.. అతడిలా మ్యాచ్ ఫినిష్ చేయడమంటే ఇష్టమని ఆమె చెప్పింది.
కిరణ్ నవగిరే పేద కుటుంబం నుంచి వచ్చింది. కిరణ్ డబ్ల్యూపీఎల్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ఆమె తల్లిదండ్రులు చిన్న ఇంట్లో అరుగు మీద నేలపై కూర్చొని ఫోన్లో ఆటను వీక్షించారు. కిరణ్ బ్యాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెపై ధోనీ ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.