News

dog with human head, Mexico: హడలెత్తించిన కుక్క… నోటితో మనిషి తల పట్టుకుని వీధుల్లో పరుగులు – a dog runs with human head in its mouth in mexico streets


Mexico: ఓ కుక్క.. నోటిలో మనిషి తలను పెట్టుకుని నగర వీధుల్లో పరుగులు తీసింది. అది చూసిన వారంతా హడలి పోయారు. ఈ భయంకరమైన సంఘటన మెక్సికోలోని జకాటెకాస్‌లో చోటుచేసుకుంది. నోటి దవడకు మనిషి తలను కరుచుకుని ఓ శునకం పరుగులు తీసింది. ఈ సంఘటనను ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న మెక్సికన్ పోలీసులు… ఆ కుక్కను పట్టుకుని దాని నుంచి మనిషి తలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరం జరిగిన ప్రాంతం నుంచి కుక్క ఆ తలను తీసుకువచ్చిందని పోలీసులు స్థానిక మీడియాకు తెలియజేశారు. వాస్తవానికి నేర సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. ఒక మనిషి తలను అక్కడి నుంచి కుక్క ఎత్తికెళ్లినట్లు స్థానికులు చెప్పినట్టు అక్కడ మీడియా వెల్లడించింది.

మాఫియా ఘర్షణలు…
అయితే శునకం మనిషి తలతో కనిపించిన జకాటెకాస్ ప్రాంతంలో కొన్ని రోజులుగా డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ అనేక హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల అక్కడ రెండు టీమ్‌ల మధ్య జరిగిన ఫైరింగ్‌లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో స్థానిక మాజీ మేయర్ కూడా ఉన్నారు. నిజానికి అక్కడ డ్రగ్స్ మాఫియా ముఠాల్లో ప్రభుత్వం చెందిన అధికారులు భాగమై ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మాఫియా ఘర్షణలో చనిపోయిన ఓ వ్యక్తి తల తెగిపడిపోయిందని, ఆ తలను కుక్క ఎత్తుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ తల ఎవరిదనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఆ తలకు సంబంధించిన వ్యక్తి శరీరం కూడా దొరకలేదు.

Related Articles

Back to top button