Entertainment

Guess The Actress: రాజమండ్రి అందాలు ఆస్వాదిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ అమ్మడి వయ్యారానికి పడిపోని కుర్రాళ్ళు ఉండరు


తాజాగా ఓ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. హీరోయిన్స్ లో చాలా మంది తమను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా మాస్క్ లు ధరించి జనాల్లోకి వెళ్తూ ఉంటారు.

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సినిమా హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలు ఎదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ముద్దుగుమ్మ కు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. హీరోయిన్స్ లో చాలా మంది తమను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేలా మాస్క్ లు ధరించి జనాల్లోకి వెళ్తూ ఉంటారు. తాజాగా పైన కనిపిస్తున్న ఫోటోలోని హీరోయిన్ కూడా అదే పని చేసింది. జనాలు గుర్తుపట్టకుండా ఉండేలా రెడీ అయ్యి బయటకు వచ్చి తిరుగుతూ కనిపించింది . ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా .. సాయం కాలం సమయంలో గోదావరి అందాలను తిలకించేందుకు వెళ్లిన ఆ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి చూద్దాం..? ఆ అమ్మడు ఎవరో కాదు.

పై ఫొటోలో రాజమండ్రి అందాలను ఆస్వాదిస్తోన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఆమె పాయల్ రాజ్ పుత్. ఒకే ఒక్క సినిమాతో ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాను కుర్రకారు అంత సులభంగా మర్చిపోరు. తొలి సినిమాతోనే అందంతో కట్టిపడేసింది పాయల్. ఏమాత్రం మొహమాటపడకుండా అందాలు ఆరబోస్తూ కవ్వించింది.

ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆర్ఎక్స్ 100 సినిమా రేంజ్ లో హిట్ మాత్రం అందుకోలేకపోతోంది. రీసెంట్ గా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో నటించింది. ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది. ఇక సోషల్ మీడియాలో పాయల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది., నిత్యం రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలా రాజమండ్రిలో తళుక్కుమన్నది పాయల్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Advertisement

Related Articles

Back to top button