Entertainment

Antahpuram Movie: అంతఃపురం సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడెలా ఉన్నాడంటే..


1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించగా.. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా అనేక అవార్డ్స్ అందుకుంది. ఇందులో సౌందర్య నటనకుగానూ ఆమెకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు.

Antahpuram Movie: అంతఃపురం సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడెలా ఉన్నాడంటే..

Soundarya Anthapuram Movie

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అంతఃపురం ఒకటి. సాయి కుమార్, దివంగత నటి సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1998లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించగా.. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.కిరణ్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా అనేక అవార్డ్స్ అందుకుంది. ఇందులో సౌందర్య నటనకుగానూ ఆమెకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులలో మనసులలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ చిత్రం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా ఇందులో తన కొడుకు కోసం ఓ తల్లి పడే తపన.. పోరాటం.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తల్లిగా తన నటనతో సౌందర్య నటనకు ఆడియన్స్ ను కంటతడి పెట్టించింది. ఇందులో సౌందర్య తనయుడిగా కనిపించిన చిన్నోడి పేరు కృష్ణ ప్రదీప్. కేవలం రెండేళ్ల వయసులోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో కనిపించలేదు ఈ అబ్బాయి. చదువు దెబ్బతినకూడదని కృష్ణ ప్రదీప్ తల్లిదండ్రులు అతడిని సినిమాలకు దూరంగా ఉంచారు. అంతఃపురం సినిమా రిలీజ్‌ అయ్యి 25 ఏళ్ళు. అంటే ప్రస్తుతం కృష్ణ ప్రదీప్ వయసు 27 ఏళ్ళు.

ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు హీరోగా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

Advertisement



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button