Entertainment

Baanam Movie: బాణం మూవీ హీరోయిన్ వేదిక గుర్తుందా ?.. ఇప్పుడు ఎంతగా మారిపోయిందో చూశారా ?..


నారా రోహిత్ హీరోగా బాణం చిత్రంతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ చిత్రం మద్రాసి మూవీతో 2006లో తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ మూవీ హిట్ అయినా.. ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో కొందరు పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో గడుపుతుండగా.. మరికొందరు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ వేదిక ఒకరు. నారా రోహిత్ హీరోగా బాణం చిత్రంతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ చిత్రం మద్రాసి మూవీతో 2006లో తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

బాణం సినిమా తర్వాత ముని, రూలర్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరమైంది. అందుకు కారణం ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాకపోవడమే. ఇటీవల బంగర్రాజు చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. ఇవే కాకుండా.. తెలుగులో పలు చిత్రాల్లో అతిథి పాత్రలలో కనిపించింది. 2016లో ఆమె కన్నడ చిత్రం శివలింగ కన్నడ పరిశ్రమలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వేదిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లను ఆకట్టుకుంది. తాజాగా వేదిక షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం వినోదన్, జంగిల్ సహా తమిళ చిత్రాల్లో నటిస్తుంది. వేదికకు ఇన్ స్టాలో 4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement



Related Articles

Back to top button