Sreeleela: శ్రీలీల స్టార్డమ్ అలాంటిది మరి.. భగవంత్ కేసరి కోసం ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?
బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి శుక్రవారం (అక్టోబర్ 19)న గ్రాండ్‌గా రిలీజైంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. కాజల్ అగర్వాల్ మరో కీలక పాత్ర పోషించింది.
పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోన్న భగవంత్ కేసరిలో విజ్జీ పాపగా శ్రీలీల నటన అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి. బాలకృష్ణ తర్వాత ఈ అమ్మడి అభినయమే సినిమాకు హైలెట్‌గా నిలిచిందని రివ్యూలు వస్తున్నాయి.
కాగా ఇటీవల శ్రీలల నటించిన స్కంద జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో రిలీజైన భగవంత్ కేసరి హిట్ కావడం, శ్రీలలకు మంచి పేరు రావడంతో ఈ యంగ్ సెన్సేషన్ ఫుల్ ఖుషిలో ఉందని తెలుస్తోంది.
అయితే భగవంత్ కేసరి సినిమాకు శ్రీలీల షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నటి కాజల్ అగర్వాల్‌తో దాదాపు సమానంగా రూ.1.5 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీలీల రూ. 5లక్షల పారితోషకంతో సినిమా కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు భగవంత్ కేసరి కోసం ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్, క్రేజ్ బాగా పెరిగిపోయిందంటున్నారు ఫ్యాన్స్.