Vimala Raman: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగపతిబాబు హీరోయిన్.. చూస్తే అవాక్ అవ్వాల్సిందే

విమలారామన్.. ఈ బ్యూటీ గుర్తుందా ఒకప్పుడు గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్నది. మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. విమలా రామన్ 2006 లో బాలచందర్ దర్శకత్వం వహించిన పోయి అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆమె మొదటి మలయాళ చిత్రం సురేష్ గోపితో చేసిన సమయం. ఇక తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఎవరయినా ఎపుడైనా సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాలో గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడంతో నటనతో ఆకట్టుకున్న ఈ భామ. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన గాయం 2 సినిమాలో జగపతిబాబు తో కలిసి ఒక రేంజ్ లో రొమాన్స్ చేసింది ఈ చిన్నది.
ఈ అమ్మడి అందానికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలి, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అమ్మాయి, ఓం నమోవెంకటేశాయ లాంటి సినిమాల్లో నటించి అలరించింది. ఆ తర్వాత తెలుగులో నటించలేదు.
తమిళ్ లో మాత్రం అడపాదపా సినిమాలు చేస్తోంది. కాగా ఈ అమ్మడు అసలు ఇప్పుడు ఎలా ఉంది అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎలా ఉంది మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram