Entertainment

Director Bobby: డైరెక్టర్ బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మరదలు అవుతుందని మీకు తెల్సా..?


ద్రోణవల్లి హారిక.. సినీ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ)కి మరదలు అన్న సంగతి మీలో ఎంత మందికి తెలుసు. అవునండి.. బాబు.

Director Bobby: డైరెక్టర్ బాబీకి గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మరదలు అవుతుందని మీకు తెల్సా..?

Director Bobby – Harika Dronavalli

గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక మీకు తెలుసు కదా..! మన గుంటూరు జిల్లా అమ్మాయి. చెస్‌లో మంచి ప్రతిభ కనబరిచింది. ఇంటర్నేషనల్ లెవల్‌లో ఎన్నో పతకాలు గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సైతం దక్కించుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పద్శ శ్రీ కూడా అందజేసింది. కోనేరు హంపి తరవాత గ్రాండ్ మాస్టర్ అయిన రెండో మహిళ హారికే. అయితే హారిక ఫిల్మ్ డైరెక్టర్ బాబీకి మరదలు అవుతుందని మీకు లెల్సా..? చాలామందికి ఈ విషయం తెలియదు. హారిక సిస్టర్ అనూషను బాబీ మ్యారేజ్ చేసుకున్నాడు. అందుకే బాబీ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యే సమయంలో విషెస్ చెబుతూ ఉంటారు హారిక.

తాజాగా ఆదివారం వైజాగ్‌లో జరిగి వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్‌ను టీవీలో వీక్షించిన హారిక.. బాబీతో పాటు చిరు మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన బావ బాబీకు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘‘సో సో సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేశావో నాకు తెలుసు. నీ రాబోయే విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నా’’ అని హారిక తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. బాబీ లాస్ట్ ఫిల్మ్ ‘వెంకీ మామ’ విడుదలైనప్పుడు కూడా హారిక ఇలాగే శుభాకాంక్షలు తెలిపారు.

తొలుత రైటర్‌గా పనిచేసిన బాబీ.. రవితేజ హీరోగా వచ్చిన ‘పవర్’ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా బాగానే ఆడింది. ఆ తరవాత పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ తీశారు. ఇది అంతగా ఆడలేదు. కానీ, ఆ తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘జై లవ కుశ’ మంచి హిట్ అయ్యింది. 2019లో వచ్చిన ‘వెంకీ మామ’ నిరాశపరిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కాంబినేషన్‌లో ‘వాల్తేరు వీరయ్య’ పేరుతో పక్కా మాస్ సినిమా తీశాడు బాబీ. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ఈ మూవీ రిలీజ్ అవుతుంది.

Advertisement

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



Related Articles

Back to top button