Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకూమారుడు.. ఆ తర్వాత బైక్ మెగానిక్.. అబ్బాస్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు..
కోల్‌కతాకు చెందిన అబ్బాస్ టీనేజ్ లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో కొన్ని సినిమాలు చేశారు. 1996లో ప్రేమదేశం సినిమాతో తెరంగేట్రం చేసాడు. తొలి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నారు. అయితే కొద్ది రోజులు న్యూజిలాండ్‌లో బైక్ మెకానిక్ గా వర్క్ చేశారు.
భారతీయ సినీ పరిశ్రమలో అతను చాలా ప్రత్యేకం. ప్రారంభ ప్రయత్నాలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి తారల జాబితాలో అబ్బాస్ ఒకరు. ఒకప్పుడు సూపర్ స్టార్ అయితే ఆ తర్వాత బైక్ మెకానిక్‌గా పనిచేశారు. భారతదేశాన్ని వదిలి విదేశాల్లో సెటిల్ అయ్యారు అబ్బాస్. ఆయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ. కోల్‌కతాకు చెందిన అబ్బాస్ టీనేజ్ లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో కొన్ని సినిమాలు చేశారు. 1996లో ప్రేమదేశం సినిమాతో తెరంగేట్రం చేసాడు. తొలి సినిమాతోనే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నారు. అయితే కొద్ది రోజులు న్యూజిలాండ్‌లో బైక్ మెకానిక్ గా వర్క్ చేశారు.
ఒకప్పుడు తమిళ చిత్రాలలో అతిపెద్ద స్టార్‌గా కొనసాగిన అబ్బాస్ కొంతకాలం పెట్రోల్ పంపులో పనిచేశారు. ప్రస్తుతం అతని వయసు 45 ఏళ్లు. “ఒక నటుడు భారతదేశంలో సినిమాలకు విరామం తీసుకుంటే, అతను ఏమి చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని.. .కానీ న్యూజిలాండ్‌లో చూడటానికి ఎవరూ లేరు, ప్రతి ఒక్కరూ వారి స్వంత వ్యవహారాలలో బిజీగా ఉంటారని ” గతంలో అన్నారు అబ్బాస్. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల కారణంతో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని గతంలో తెలిపారు.
అయితే ప్రస్తుతం ఆత్మహత్యల పట్ల మొగ్గు చూపుతున్న పిల్లల మనసులు మార్చే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను ఆస్ట్రేలియా వెళ్లి పబ్లిక్ స్పీకింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సు చేశానని అబ్బాస్ తెలిపారు. అబ్బాస్ భార్య ఎరుమ్ అలీ ఒక ప్రసిద్ధ డిజైనర్, ముఖ్యంగా ఆమె పెళ్లి దుస్తులకు డిజైన్ చేస్తుంటారు. 2000ల ప్రారంభంలో స్టార్ హీరోగా అనేక ప్రతిష్టాత్మక చిత్రాలలో అబ్బాస్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా సెటిలయ్యాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.