Entertainment

అవతార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రెంట్‌ చెల్లించకుండానే ఓటీటీలో ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ చూడొచ్చు. ఎందులో అంటే..


Avatar 2: ప్రపంచ సినిమా రంగంలో అవతార్‌ సినిమా సృష్టించిన అద్భుతం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఇక అవతార్‌..

Avatar 2: ప్రపంచ సినిమా రంగంలో అవతార్‌ సినిమా సృష్టించిన అద్భుతం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది. ఇక అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ సైతం ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ మూవీ ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే పే రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తాజాగా రెంట్‌ చెల్లించకుండానే సినిమాను చూసే అవకాశం లభించింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోన్న డిస్నీ+హాట్‌స్టార్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విజువల్‌ వండర్‌ని జూన్‌ 7న విడుదల చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా హాట్‌ స్టార్‌ ప్రకటించింది. అయితే అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మొన్నటి వరకు పే అండ్‌ వాచ్‌ విధానంలో ఉండడం వల్ల చూడలేక పోయిన సీని ప్రేక్షకులు అవతార్‌ సీక్వెల్‌ను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. మరి థియేటర్లలలో వండర్‌ క్రియేట్ చేసిన అవతార్‌ ఓటీటీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాసింది. ఇక మార్చి 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కాగా.. మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. తాజాగా డిస్నీ+హాట్‌ స్టార్‌లో ఎలాంటి రెంట్‌ లేకుండా స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button