Entertainment

Pawan Kalyan: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబోలో సూపర్ హిట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..


Pawan Kalyan: మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబోలో సూపర్ హిట్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే థియేటర్లలో మెగా అభిమానులకు పండగే. ఆయన మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక అదే స్థాయిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద రచ్చే ఇక. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలసి ఓ సినిమా చేయాల్సి ఉందట. కానీ చివరి క్షణంలో ఆ మూవీ మిస్ అయ్యిందట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా ?.. అదే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా.. మల్టీస్టారర్ చిత్రాలకు మరోసారి పునాదులు వేసింది.

అయితే ఈ సినిమాలో పెద్దోడు, చిన్నోడి పాత్రలకు ముందుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను అనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం పెదకాపు 1. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా ఇటీవల పెదకాపు ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకుని ఎందుకు తీయలేదు అని ప్రశ్నించగా.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో పెద్దోడి పాత్ర కోసం ముందుగా పవన్ ను అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ తర్వాత కాంబినేషన్స్ మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత పవన్, వెంకీ కలిసి గోపాల గోపాల మూవీలో నటించారు.

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Pawan Kalyan (@pawankalyan)

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేష్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Related Articles

Back to top button