News

director siva, Suriya 42 : సూర్య కొత్త సినిమా షురూ.. రంగంలోకి మాస్ డైరెక్టర్ శివ – suriya siva new project shoot started


నటుడిగా సూర్యకు ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో సూర్య మీద అందరికీ గౌరవం పెరిగింది. నటుడిగా సూర్య మరో స్థాయికి వెళ్లాడు. ఎవరికీ తలవంచడు అనే సినిమాతో సూర్యకు ఓ ఫ్లాప్ వచ్చింది. ఇప్పుడు సూర్య మరో కొత్త సినిమాను ప్రారంభించేశాడు.

మాస్ కమర్షియల్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా తమళంలో ఎదిగిన శివ.. ఇప్పుడు సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌తో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తోంది.

మొదటి నుంచి కమర్షియల్ తో పాటు వినూత్నమైన కథలను ఎన్నుకుంటూ.. మిర్చి, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్, బాగమతి లాంటి ఎన్నో విజయాలతో అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది యూవీ క్రియేషన్స్. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లో కూడా యూవీ క్రియేషన్స్ సత్తా చూపించింది.

ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో సూర్య, అగ్ర దర్శకుడు శివ కాంబినేషన్‌లో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ నెం 25గా యువి క్రియేషన్స్‌తో సంయుక్తంగా ఒక భారీ ప్రాజెక్టుకు ముహూర్తం పెట్టారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చిత్ర యూనిట్‌తో పాటు అతిరథ మహారధుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Related Articles

Back to top button