Entertainment

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని వెబ్ సిరీస్‏గా ఎందుకు తీయలేదు ?..డైరెక్టర్ మణిరత్నం రియాక్షన్ ఏంటంటే..


ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1న సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

చాలా కాలం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). 1954లో విడుదలైన ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన హిస్టారికల్ ఫిక్షన్ నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‏గా ఈ సినిమాలో విక్రమ్ చియాన్, కార్తీ, త్రిష, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను నెలకొల్పింది. అయితే పొన్నియిన్ సెల్వన్ నవల ఐదు భాగాలు ఉండగా.. ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1న సెప్టెంబర్ 30న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి



ఇటీవల త్రివేండ్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని వెబ్ సిరీస్ కాకుండా రెండు భాగాలుగా ఎందుకు తెరకెక్కిస్తున్నాడనే విషయాన్ని తెలియజేశాడు. ” నేను పొన్నియిన్ సెల్వన్ నవల చదివే సమయానికి స్కూల్ విద్య పూర్తిచేశాను. అప్పుడే అనిపించింది ఈ కథను సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని. సాహసం, గుర్రాలు, యుద్ధం, స్త్రీలు, పురుషులు , ప్రతిదీ చాలా గ్రాఫిక్‌గా అనిపించాయి. ఈ చిత్రాన్ని నేనెప్పుడు వెబ్ సిరీస్ చేయాలనుకోలేదు. ఇది కచ్చితంగా సినిమాగా తీసుకురావాలనుకున్నాను. అయితే ఎవరైనా రూపొందిస్తారని అనుకున్నాను. కానీ నాకు ఛాన్స్ వచ్చింది. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఒక చిత్రంలో ఉండాల్సినవి అన్ని ఇందులో ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు మణిరత్నం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button