Entertainment

Mahesh Babu: మహేష్ మురారి సినిమాకు రాజీవ్ గాంధీ మరణానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?


మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచినా సినిమాలు చాలా ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా తో సంబంధం లేకుండా మహేష్ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. మహేష్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచినా సినిమాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మురారి సినిమా గురించే.. మహేష్ సినీ ప్రయాణంలో మొదటి భారీ విజయం ఈ సినిమా.. అప్పటి వరకు లవ్ స్టోరీస్ చేస్తూ వస్తున్న మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది ఈ సినిమా.. ఈ సినిమాలో మహేష్ నటన.. దర్శకుడు కృష్ణ వంశీ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథకు రాజీవ్ గాంధీ హత్యకు చిన్న లింక్ ఉందట..

ఒకసారి దర్శకుడు కృష్ణ వంశీ ఓ లాంచీలో ప్రయాణిస్తుండగా.. ఆ లాంచీలో కూర్చున్న వారు రాజీవ్ గాంధీ హత్య గురించి మాట్లాడుకుంటున్నారట. ఆ సందర్భంలో ఎవరో వారి కుటుంబానికి శాపం ఉందేమో.. అందుకే వరుసగా అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారట. అది విన్న కృష్ణ వంశీ శాపం కారణంగా మనుషులు చనిపోవడం అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ కు జోడించి కథను రాసుకున్నారట. అలాగే  మహేష్ ను చూడగానే కృష్ణుడు లా అనిపించింది. బృందావనం, అప్పటి వాతావరణం అన్ని మైండ్ లో తిరిగాయట. దాంతో మురారి సినిమాకు భాగవతం, భారతంలోని పాత్రలను జోడించారట కృష్ణవంశీ. ఇదే విషయాన్నీ ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ కథాంశంతోనే మురారి సినిమాను తెరకెక్కించారట. మురారి సినిమా అపట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్శకుడిగా కృష్ణ వంశీ స్థాయిని పెంచింది ఈ మూవీ. అలాగే మురారి సినిమా ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా పెళ్ళిసాంగ్. ఇప్పటికి చాలా పెళ్లిళ్లలో ఆ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button