Boyapati Srinu: మరోసారి తన బలాన్ని పరీక్షిస్తున్న దర్శకుడు బోయపాటి.. ఏ విషయంలో అంటే..?
ఆయనతో సినిమాలు చేస్తే మీసాల నుంచి కథలు పుడతాయి.. గెటప్స్ నుంచి బ్లాక్‌బస్టర్స్ వస్తాయి..! మీసాలు, రోషాలు చూపిస్తే బ్లాక్‌బస్టర్స్ వస్తాయా..? మేం మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నామా అనుకుంటున్నారు కదా..!
ఆయనతో సినిమాలు చేస్తే మీసాల నుంచి కథలు పుడతాయి.. గెటప్స్ నుంచి బ్లాక్‌బస్టర్స్ వస్తాయి..! మీసాలు, రోషాలు చూపిస్తే బ్లాక్‌బస్టర్స్ వస్తాయా..? మేం మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నామా అనుకుంటున్నారు కదా..! మీ కాన్పిడెన్స్ కాసేపు అలాగే కంటిన్యూ చేయండి. అదే కాన్పిడెన్స్‌తో ఒక్కసారి ఈ స్టోరీ కూడా చదివేయండి..
ఈ మధ్య బాలయ్య ట్రాక్ రికార్డ్ బోయపాటితోనే ఎందుకు 100 శాతం ఉందో తెలుసా? ఇంకెందుకు.. బాలయ్యను ఆయన చూపించినంత పవర్ ఫుల్‌గా మరొకరు చూపించలేకపోవడమే. కానీ బోయపాటి వర్షన్ మరోలా ఉంది.. బాలయ్యతో చేసే కథ ఎలా ఉన్నా.. గెటప్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు బోయపాటి. అదే సినిమాకు హెల్ప్ అవుతోంది.
కథ విషయంలో కాస్త రొటీన్‌గా ఉన్నా.. గెటప్ మ్యాటర్ వచ్చేసరికి మాత్రం నో కాంప్రమైజ్ అనే దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా రామ్‌ను కూడా గుర్తు పట్టకుండా మార్చేసారు ఈ మాస్ డైరెక్టర్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైందిప్పుడు. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత లావుగా ఇందులో ఉన్నారు రామ్. సోమవారం(మే 15న) సినిమా టీజర్ విడుదల చేశారు. రామ్ డిఫరెంట్ మాస్ లుక్‌లో అదరగొడుతున్నారు.
బోయపాటి, రామ్ పోతినేని మూవీ టీజర్..
ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఒకటి కథ కొత్తగా ఉండాలి లేదంటే గెటప్ డిఫెరెంట్‌గా ఉండాలి. బోయపాటి ఎప్పుడూ రెండోదే ఎంచుకుంటారు. సింహా, లెజెండ్, అఖండలో బాలయ్యను.. దమ్ములో ఎన్టీఆర్‌ను.. సరైనోడులో అల్లు అర్జున్‌ను కొత్తగా చూపించారు బోయపాటి. మరోసారి తన బలాన్నే నమ్ముకుని.. ఇప్పుడు రామ్‌ని ఊహించనంతగా మార్చేసారు. మరి ఈ సినిమాతో రామ్ ఏం చేస్తారో చూడాలి..
దసరా సందర్భంగా అక్టోబర్ 20న హిందీతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజస్‌లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.
-ప్రవీణ్ కుమార్, టీవీ9 తెలుగు(ఈటీ టీమ్)
మరిన్ని సినిమా వార్తలు చదవండి