Entertainment

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్ వెనక ఇంత కథ ఉందా..! ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు బాబీ


దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)తెరకెక్కిస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ కలిసి నటిస్తోన్న మూవీ వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)తెరకెక్కిస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ తో పాటు .. ఇద్దరూ కలసి అలరించిన పూనకాలు లోడింగ్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపథ్యంలో దర్శకుడు బాబీ కొల్లి  ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు.

‘వాల్తేరు వీరయ్య బ్యాక్ స్టొరీ చెప్పాలంటే ముందు నా బ్యాక్ స్టొరీ చెప్పాలి. చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. చిరంజీవి గారి సినిమాలో పని చేయాలనే ఒక కల వుండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదలౌతుంది. నా జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్ ఇది అని అన్నారు. చిరంజీవి గారు, రవితేజ గారు ఎలా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారో నేను కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చాను. వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేయడం నా అదృష్టం. మాస్ ఆడియన్స్ ఏం కావాలో అనే దానిపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి డిజైన్ చేయడం జరిగిందని అన్నారు బాబీ

ఇక మెగాస్టార్ గారు ఎన్నో విజయాలు బ్లాక్ బస్టర్లు అలాగే కొన్ని అపజయాలు కూడా చూసుంటారు. ఆయనకి ఉన్నంత బ్యాలెన్స్ ఎవరికీ ఉండదని కూడా చెప్పొచ్చు. అలాగే రవితేజ గారు కూడా అంతే. ఒక సినిమాకి చేయాల్సిన న్యాయం కష్టం సర్వస్వం పెడతారు. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని బలంగా నమ్ముతారు. నిజానికి ఈ కథ లాక్ డౌన్ కి ముందు ఒక ఫ్యాన్ బాయ్ గానే చెప్పాను. అయితే లాక్ డౌన్ లో పరిస్థితులు మారిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఓటీటీకీ అలవాటు పడ్డారు. డిఫరెంట్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అందరినీ అలరించే కథ చెప్పాలని ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. దాంట్లో నుండి వచ్చిన క్యారెక్టరే రవితేజ గారిది. ఒక ఫ్యాన్ బాయ్ గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ గా ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ డిజైన్ చేశాను. ఇందులో చివరి వరకూ కథే గొప్పగా కనిపిస్తుంది. బీసి సెంటర్ ఆడియన్స్ తో పాటు మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని కూడా అలరించే అన్ని గుణాలు లక్షణాలు వాల్తేరు వీరయ్యలో కనిపిస్తాయి.

సినిమాలో ప్రతి సీన్ లో ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్ వుంటాయి. పండక్కి రాబోతున్న కలర్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ‘వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో వున్నప్పుడు చిరంజీవి గారి నాన్నగారు దగ్గర పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఐదు వందలు ఇచ్చి ఫోటో షూట్ చేయించారు. ఆ ఫోటోల వలనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం అని అన్నారు దర్శకుడు బాబీ.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Advertisement

Related Articles

Back to top button