స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సంక్రాంతికి వారసుడుగా (తమిళంలో వారిసు) తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుఉనే ప్రయత్నం చేయబోతున్నారు. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు (Dil Raju), శిరీష్ నిర్మాతలు. తమిళ సినిమానే అయినప్పటికీ తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాలనేది దిల్ రాజు ప్లాన్. అయితే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya).. బాలకృష్ణ వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమాలు కూడా పోటీలోకి ఉన్నాయి.
తెలుగు సినిమాలకు కాకుండా వారసుడు సినిమాకు దిల్ రాజు ఎక్కువ థియేటర్స్‌కు కేటాయించటంపై మెగా, నందమూరి ఫ్యాన్స్ దిల్ రాజుపై ఫైర్ అయ్యారు. పలు ఇంటర్వ్యూస్లోనూ ఆయన అస్సలు వెనక్కి తగ్గేదేలే అన్నట్లు మాట్లాడారు కూడా. అయితే చివరి నిమిషంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. వారసుడు సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కానీ తమిళంలో వారిసు చిత్రాన్నిజనవరి 11నే రిలీజ్ చేస్తున్నానని కూడా అన్నారు. సినిమా కథేంటో ముందే తెలిసినపోయినప్పటికీ సినిమాపై తనకు నమ్మకం ఉందని దిల్ రాజు గట్టిగా నమ్ముతున్నారు.
ఇదే విషయాన్ని ఆయన ప్రెస్‌మీట్‌లోనూ గట్టిగా చెప్పారు. ఈ నిర్ణయం ఏదో ముందే తీసుకుని ఉండుంటే బావుండేదిగా అని ప్రశ్న వచ్చినప్పుడు ముందుగా అలాంటి నిర్ణయం తీసుకుంటే దిల్ రాజు తగ్గిపోతాడుగా అని అన్నారు. మరి ఇప్పుడు తగ్గలేదా? అని అన్నప్పుడు ఎప్పుడు నెగ్గాలో కాదు.. ఎప్పుడు తగ్గాలో తెలియాలని పవన్ కళ్యాణ్‌గారు ఊరకనే అనలేదు అంటూ అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్‌ను వాడారు రాజుగారు. దీంతో దిల్ రాజు పవన్‌కళ్యాణ్‌ను ఫాలో అవుతన్నారంటూ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
- Read Latest Tollywood Updates & Telugu News