Vishnu Manchu: మంచు విష్ణు రీమేక్ చేసిన అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ఎదో మీకు తెలుసా.?
అలాగే బాలీవుడ్ సినిమాలు కూడా మనదగ్గర బాగానే రీమేక్ అయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సినిమా ఒకటి టాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం ఇప్పుడు కొత్తగా జరుగుతుందేమి కాదు. గతంలో చాలా సినిమాలు అలా రీమేక్ అయినవే.. ఎక్కువగా టాలీవుడ్ సినిమాలు తమిళ్ లో అక్కడి సినిమాలు మనదగ్గర రీమేక్ అయ్యాయి. అలాగే బాలీవుడ్ సినిమాలు కూడా మనదగ్గర బాగానే రీమేక్ అయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సినిమా ఒకటి టాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. అక్కడ ఘనవిజయం సాధించిన ఆ సినిమా మనదగ్గర మాత్రం దారుణంగా నిరాశపరిచింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యి మనదగ్గర బోల్తా కొట్టిన సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమానే ‘సర్ఫరోష్’ ఇంతకు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన హీరో ఎవరో కాదు మంచు విష్ణు.
అమీర్ ఖాన్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన సర్ఫరోష్ సినిమా 1999 ఏప్రిల్ 30న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఇదే సినిమాను తెలుగులో అస్త్రం పేరుతో రీమేక్ చేశారు మంచు విష్ణు.
డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క విష్ణుకు జోడీగా నటించారు. అయితే అస్త్రం సినిమా మనదగ్గర మాత్రం హిట్ కాలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో ప్రేమకన్నా ఏముంది ప్రియా అనే పాట మాత్రం సూపర్ హిట్ అయ్యింది.Astram