News
Devusinh Chauhan, ఏపీ సీఎం జగన్పై కేంద్రమంత్రి ఘాటు వ్యాఖ్యలు – union minister devusinh jesingbhai chauhan comments on ap cm ys jagan
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని.. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదన్నారు. వాలంటీర్లు సేవ చేయడం లేదని.. ఇతర పార్టీలను అణచి వేసేందుకు వారిని ఉపయోగించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యం కాదని.. ప్రభుత్వ విధులు నిర్వహించడంలో వాలంటీర్లు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. 14, 15వ ప్రణాళిక సంఘం నిధులను గ్రామీణాభివృద్ధి కోసం ఇస్తే.. ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందన్నారు. దీనిపై సర్పంచ్లు తనకు వినతిపత్రాలు ఇచ్చారని చెప్పారు.. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా వ్యాఖ్యానించారు.
కేంద్రం 20 లక్షల గృహాలను ఏపీకి మంజూరు చేసిందని.. ఇక్కడ చూస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదన్నారు కేంద్రమంత్రి. మౌలిక సదుపాయాలు కూడా లేవని.. ఆయుష్మాన్ కార్డులను పేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం చేసిన అభివృద్ధి, రాష్ట్రం చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందని.. ఏపీలో ప్రతి వ్యక్తికి సాయం చేయడానికి ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారన్నారు దేవుసిన్హ్ చౌహాన్.
- Read Latest Andhra Pradesh News and Telugu News