News

devatha serial, Devatha ఆగష్టు 24 ఎపిసోడ్: సత్యకు ఊహించని జలక్.. అల్లాడిన కన్నతండ్రి గుండె – devudamma gets emotional about rukmini’s disappearance in devatha serial today 2022 august 24 episode


గత ఎపిసోడ్‌లో కమల కూతురు బారసాలకు రాధ వెళ్లడం.. ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడటం తెలిసిందే. అయితే రాధకు మాధవ కావాలనే వార్నింగ్ ఇస్తాడు. ఆ సీన్ నేటి కథనంలో కంటిన్యూ అవుతుంది.

633వ ఎపిసోడ్‌ హైలైట్స్..
బిడ్డకు అక్షింతలు వేసిన రాధ.. పక్కనే నిలబడితే.. దేవి, సత్యా అంతా సెల్ఫీలు తీసుకోవడానికి వెళ్లిపోతారు. అప్పుడే మాధవ రాధ దగ్గరకు వచ్చి.. ‘ఇప్పటికిప్పుడు నువ్వే వీళ్లకి కావాల్సిన రుక్మిణీ అని చెప్పగలను.. కానీ చెప్పను. ఎందుకంటే దేవి ముందు నేను చెడ్డవాడ్ని కావద్దు కదా.. మర్యాదగా ఇంటికి పదా రాధా’ అంటాడు కోపంగా. పాపం రాధ అక్కడ నుంచి కోపంగా బయటికి వెళ్లి మాధవ కారు దగ్గర నిలబడుతుంది. మాధవ.. దేవి, చిన్మయిలని పిలుస్తాడు వెళ్దాం పదండి అని. దేవుడమ్మ.. ‘ఇంకాస్త సమయం ఉండనివ్వండి మాధవ.. మీ అమ్మ వాళ్లతో వస్తారులే’ అంటుంది.

దాంతో మాధవ కారు దగ్గరకు వెళ్తాడు. అప్పుడే రాధ మాధవకు వార్నింగ్ ఇస్తుంది. చాలా ఎక్కువ చేస్తున్నావ్.. నీ కుట్రలు చెల్లవు.. ఎలాగైనా నా బిడ్డని నా భర్తని కలుపుతాను’ అంటూ వార్నింగ్ ఇస్తుంది. సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ గదిలోకి వెళ్లి రుక్మిణీ ఫొటో పట్టుకుని చాలా ఏడుస్తుంది. అది భాగ్యమ్మ వెనుక నుంచి చూసి.. నిజం చెప్పలేక నిస్సహాయంగా అడుగులు వేస్తుంది అక్కడ నుంచి. అప్పుడే దేవి.. దేవుడమ్మని వెతుక్కుంటూ దేవుడమ్మ ఉన్న గదిలోకి వెళ్తుంది. ‘దేవుడమ్మ అవ్వ ఎక్కడా?’ అని అందరినీ అడుగుతూ.

అప్పుడే దేవి అటు వెళ్లడం చూసిన భాగ్యమ్మ.. పరుగున వెళ్లి.. దేవిని దేవుడమ్మ గదిలోకి వెళ్లకుండా బయటికి తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడమ్మ చేతిలో రుక్మిణీ ఫొటో ఉంది కాబట్టి.. అది దేవి చూస్తే గుర్తు పట్టేస్తుంది కాబట్టి. మొత్తానికీ పెద్ద ప్రమాదం తప్పిందని మనసులో అనుకుంటుంది భాగ్యమ్మ. మొత్తానికీ జానకీ వాళ్లు బయలుదేరే సమయానికి.. దేవుడమ్మ.. ‘మీ రాధని చూసే అవకాశమే రావట్లేదు.. కనీసం ఈ చీరనైనా తీసుకోమనండి’ అంటుంది జానకీతో. ‘అయ్యో ఎంత మాట.. తప్పకుండా మా రాధని మీకు చూపిస్తాం’ అంటుంది జానకీ. మాటి ఇస్తున్నారు మరి అంటుంది దేవుడమ్మ. తప్పకుండా అంటుంది జానకీ. అంతా విన్న సత్యకు గుండెల్లో రాయిపడినట్లుగా అవుతుంది.

ఇక మాధవ ఇంటికి వచ్చి రగిలిపోతూ ఉంటే.. ఆదిత్య గురించి, దేవుడమ్మ గురించి పొగుడుకుంటూ.. వాళ్లు పెట్టిన చీరలు చూస్తూ ఉంటారు జానకీ, రామ్మూర్తి. మరోవైపు రాధ, ఆదిత్య ఎప్పటిలానే చాటుగా ఒక చోట కలుస్తారు. ‘నా వాళ్లనందరినీ చూసుకోగలిగాను’ అంటూ రాధ మురిసిపోతుంటే.. దేవిని అంతా కన్నబిడ్డలా చూస్తున్నారు అని ఆదిత్య మురిసిపోతాడు. సరిగ్గా అప్పుడే.. ఆదిత్య.. ‘నా బిడ్డ దేవి.. నా ఇంట్లో అందరినీ తనకు ఏ వరస అవుతారో ఆ వరుసతోనే పిలుస్తోంది. కానీ నాకే నాన్న అని పిలిపించుకునే అవకాశం లేకుండా పోయింది’ అంటూ అల్లాడిపోతాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.

Related Articles

Back to top button