News
delhi woman beating video, ఢిల్లీలో షాకింగ్ ఘటన.. నడి వీధిలో యువతి షర్టు పట్టుకుని బలవంతంగా కారులోకి ఎక్కించిన యువకుడు – man seen beating woman and forcing her into car in delhi video viral cops to probe
వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. తొలుత బాధిత యువతి క్యాబ్‌లోంచి దిగిపోయింది.. అయితే.. అదే కారులో ఉన్న ఓ యువకుడు వాహనం దిగుతున్న ఆమెను షర్ట్ పట్టి బలవంతంగా లోపలికి నెట్టాడు. ఆ సమయంలో లోపల మరో ఇద్దరు యువకులు ఉన్నారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు స్పందించి, రంగంలోకి దిగారు.
ఔటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ డీసీపీ మాట్లాడుతూ.. గత రాత్రి నుంచి వైరల్ అవుతోన్న వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ అడ్రస్ కనుగొన్నామని, అతడితో పోలీసులు త్వరలో మాట్లాడతారని ఆయన వెల్లడించారు. ‘‘ఓ యువతి, ఇద్దరు యువకులు ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసుకున్నారు.. రోహిణి నుంచి వికాస్‌పురి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కారు.. అయితే.. మార్గమధ్యంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఆ తరువాత యువతి కారు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.. ఈ క్రమంలో ఆ యువకుడు ఆమెను మెడపట్టి బలవంతంగా కారులోకి తోశాడు’’ అని తెలిపారు.
ప్రాథమిక విచారణలో గురుగ్రామ్ రత్నవిహార్‌లో కారు రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తించి, పోలీస్ బృందాన్ని అక్కడకు పంపామని చెప్పారు. అటు, వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వీడియోను షేర్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్.. ‘యువతిని వేధించి బలవంతంగా కారులోకి ఎక్కించిన వీడియోను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చాం… నిందితులపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని ట్వీట్ చేశారు.
Read More Latest National News And Telugu News