News

dc vs csk, CSK ఓపెనర్లు వీరబాదుడు.. ఢిల్లీ టార్గెట్ 224 – chennai super kings 224 run target for delhi capitals in ipl 2023


ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో ప్లేఆఫ్స్‌‌కి చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓపెనర్లు చెలరేగిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో దేవాన్ కాన్వె (87: 52 బంతుల్లో 11×4, 3×6), రుతురాజ్ గైక్వాడ్ (79: 50 బంతుల్లో 3×4, 7×6) హాఫ్ సెంచరీలు బాదడంతో మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోకియా, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. కానీ.. ఓపెనర్ల దెబ్బకి ఢిల్లీ టీమ్‌లోని బౌలర్లందరూ ఓవర్‌కి 9-10 పరుగులపైనే సమర్పించుకున్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన దేవాన్ కాన్వె – రుతురాజ్ గైక్వాడ్ జోడి.. ఫస్ట్ నుంచే టాప్‌గేర్‌లో ఆడేసింది. మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండటంతో భారీ స్కోరుపై కన్నేసిన ఈ ఓపెనర్లు ఓవర్‌కి 10 పరుగుల చొప్పున రాబడుతూ తొలి వికెట్‌కి 14.3 ఓవర్లలో 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు సాధించేలా కనిపించారు. కానీ ఇద్దరూ మూడంకెల స్కోరుని నమోదు చేయలేకపోయారు. రుతురాజ్‌ని చేతన్ సకారియా ఔట్ చేయగా.. దేవాన్ కాన్వెని నోర్తేజ్ పెవిలియన్ బాట పట్టించాడు.

అనంతరం నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన శివమ్ దూబె 9 బంతుల్లోనే 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటైపోగా.. నెం.5లో వచ్చిన రవీంద్ర జడేజా కూడా 7 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 20 రన్స్ చేశాడు. కానీ.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కాస్త ముందు వచ్చిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రం 4 బంతులాడి కేవలం 5 పరుగులే చేశాడు. ఫ్రీ హిట్ రూపంలో లాస్ట్‌ బాల్‌కి హిట్టింగ్ చేసే ఛాన్స్ వచ్చినా ధోనీ సింగిల్‌తో సరిపెట్టాడు.

Related Articles

Back to top button