Damini Yawar: ఓరి యావర్.. ఇది చాలా ఓవర్.. దామినిని డైరెక్ట్‌గా అలా అడిగేశాడేంటి? – bigg boss telugu 7 love track between damini bhatla and prince yawar
నిన్న (సెప్టెంబర్ 15) ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్.. అపరిచితుడిలా మారిపోయిన సంగతి తెలిసిందే. కాసేపు రామంలా ఏడుస్తూ, ఇంకాసేపు రెమోలా రతిక చుట్టూ తిరిగాడు. ఇక సందీప్-గౌతమ్ మీద రెచ్చిపోతూ అపరిచితుడిలా చిత్ర విచిత్రంగా ప్రవర్తించాడు. అయితే తన దగ్గర మాయాస్త్రను అన్యాయంగా తీసేసుకున్నారంటూ యావర్ రచ్చ రచ్చ చేశాడు. గుక్క పట్టి ఏడ్చాడు కూడా. ఆ సమయంలోనే మరి యావర్‌ను కూల్ చేద్దామని చేసిందో.. లేక నిజంగా ఏమైనా ఫీలింగ్ పుట్టుకొచ్చిందో తెలీదు కానీ.. దామిని కాస్త రొమాంటిక్ వేషాలు వేసింది.
యావర్ ఎదురుగా కూర్చొని “హాయ్ యావర్.. ఐ గాట్ ఫీవర్.. ఐ నీడ్ యుఆర్ కవర్.. మేక్ మీ యుర్ లవర్..” అంటూ రొమాంటిక్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో తెగ వయ్యారాలు పోయింది. అసలే లవర్ బాయ్ అయిన యావర్ ఇంతలా చెబితే ఊరుకుంటాడా? వెంటనే పుసుక్కున “ఆర్ యూ రెడీ ఫర్ ది షవర్..” (కలిసి స్నానం చేద్దామా) అనేశాడు. ఈ మాట విని దామిని అయితే అవాక్కయిపోయింది.
ఆటగాడివే
ఇక పక్కనే ఉన్న అమర్ అయితే.. “చూశావా పాప నువ్వు లవర్ వరకు మాత్రమే ఆలోచించావ్.. వాడు షవర్ వరకు వెళ్లిపోయాడు” అంటూ తెగ నవ్వుకున్నాడు. ఇక ఈ వీడియోను మీమ్స్ పేజీల్లో ఉతికారేస్తున్నారు. యావర్ మంచి ఆటగాడే అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిన్న మాయాస్త్ర పోయిన దిగుల్లో ఉన్న యావర్ ఆ కాసేపటికే రతికను చూస్తూ ఐ లైక్ యూ అనేశాడు. అసలే ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేసే రతిక కూడా.. ఐ లైక్ యూ టూ అనేసింది. దీంతో హౌస్‌లో కొత్త ట్రాకులు సెట్ అయినట్లే కనిపిస్తున్నాయి.
- Read latest TV News and Movie Updates