csk vs gt turning point, GT Loss Reasons: నో బాల్‌తో చేజారిన మ్యాచ్.. గుజరాత్ ఓటమికి 3 ప్రధాన కారణాలివే..! – darshan nalkande no ball and team selection are main reasons behind gujarat titans lost in qualifier 1
గైక్వాడ్ ఔట్.. నోబాల్..
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం లభించేది. దర్శన్ నాల్కండ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ ఓవర్ మూడో బంతికి నాల్కండే లెంగ్త్ బాల్ వేయగా.. రుతురాజ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌క సరిగా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. శుభ్‌మన్ గిల్ ఒడిసి పట్టుకున్నాడు. ఆరంభంలోనే వికెట్ తీశామన్న ఆనందంలో గుజరాత్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ నాల్కండే క్రీజ్ బయట పాదం మోపి బౌలింగ్ వేయడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. దీంతో రుతురాజ్‌కు లైఫ్ వచ్చింది. 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గైక్వాడ్.. 44 బంతుల్లో 60 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌తోపాటు కాన్వే (40) రాణించడంతో చెన్నై 172 పరుగులు చేయగలిగింది. గైక్వాడ్ ఆరంభంలోనే పెవిలియన్ చేరితే పరిస్థితి మరోలా ఉండేది.
26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు..
ప్లేఆఫ్స్ దశలో 172 పరుగుల లక్ష్యం అంత తేలికేం కాదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడితేనే లక్ష్యాన్ని చేధించే అవకాశం ఉంటుంది. కానీ పవర్ ప్లేలోనే గుజరాత్ టైటాన్స్ సాహా, హార్దిక్ పాండ్య వికెట్లను కోల్పోయింది. ఓ ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ ఉండటంతో.. పరుగులు వచ్చాయి. షనకతో కలిసి గిల్ మూడో వికెట్‌కు 31 పరుగులు జోడించడంతో గుజరాత్ 70 పరుగులకు చేరుకుంది. మహీశ్ థీక్షణ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో షనక ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. దీంతో గుజరాత్ గేర్ మారుస్తున్నట్లు కనిపించింది. కానీ 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది.
జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్‌కు యత్నించి షనక ఔట్ కాగా.. డేవిడ్ మిల్లర్ కూడా జడ్డూ బౌలింగ్‌లోనే బౌల్డయ్యాడు. దీంతో ఒత్తిడికి లోనైన శుభ్‌మన్ గిల్ కూడా చాహర్ బౌలింగ్ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్ చేరాడు. మరుసటి ఓవర్లోనే రాహుల్ థీక్షణ బౌలింగ్‌లో తెవాతియా బౌల్డయ్యాడు. దీంతో ఓ దశలో 72/2తో ఉన్న గుజరాత్.. 98/6తో కష్టాల్లో పడింది. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ (16 బంతుల్లో 30) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరడంతో.. చెన్నై మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆఖరి ఓవర్లో షమీ కూడా ఔట్ కావడంతో.. గుజరాత్ ఆలౌటయ్యింది. టైటాన్స్ ఆలౌట్ కావడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
టీమ్ సెలక్షన్..
క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. యష్ దయాల్ స్థానంలో దర్శన్ నాల్కండేను ఆడించింది. నాల్కండేకు ఈ సీజన్లో ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. మ్యాచ్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ.. లోకల్ ప్లేయర్లు సాయి సుదర్శన్, ఆర్ సాయి కిషోర్‌లకు ఆడే అవకాశం ఇవ్వలేదు. నోబాల్ వేసి గైక్వాడ్ వికెట్‌ను ఖాతాలో వేసుకునే అవకాశం కోల్పోయిన నాల్కండే.. 4 ఓవర్లలో 44 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చింది అతడే కావడం గమనార్హం.
గుజరాత్ టైటాన్స్ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు ఉన్నారు. కానీ చెపాక్ పిచ్ మీద ఫింగర్ స్పిన్నర్లు ప్రభావం చూపారు. సాయి సుదర్శన్‌ను ఆడించి ఉండుంటే.. అతడి ఎడమ చేతి వాటం స్పిన్ టైటాన్స్‌కు పనికొచ్చేది. క్వాలిఫైయర్లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు కూడా గుజరాత్‌కు ప్రతికూలంగా మారాయి. ఆర్సీబీపై నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ చేసిన విజయ్ శంకర్.. చెన్నైతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 14 పరుగులకే పెవిలియన్ చేరాడు.