News

Crypto Scam,Software Engineer: డేటింగ్ యాప్‌లో అమ్మాయిని నమ్మి.. అడ్డంగా బుక్కైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కోటి రూపాయల నష్టం! – software engineer loses rs 1 cr in bitcoin scam by woman he met on dating app


Dating App: మన దేశంలో సైబర్ నేరాలు కొంతకాలంగా ఎక్కువయ్యాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త పుంతలు తొక్కుతున్నారు మోసగాళ్లు. అమాయకుల్ని ఇట్టే బుట్టలో వేసుకొని.. లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. అలాంటి ఘటనే తాజాగా ఒకటి జరిగింది. ఇక్కడ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మి మోసపోయాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె ప్లాన్‌కు బలైన ఈ యువకుడు.. అక్షరాలా కోటి రూపాయలకుపైగా నష్టపోవడం గమనార్హం. అసలు ఇదెలా జరిగింది.. డబ్బులెలా పోయాయి.. సహా పూర్తి వివరాలు చూద్దాం.

అహ్మదాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే కుల్‌దీప్ పటేల్ తనకు సరైన మ్యాచ్ కోసం డేటింగ్ యాప్‌/మ్యారేజ్ వెబ్‌సైట్‌లో వెతుకుతున్న సమయంలో అదితి అనే యువతి పరిచయమైంది. ఆమె యూకేలో వస్తువుల ఎగుమతి, దిగుమతుల వ్యాపారం చేస్తున్నట్లు అతడిని నమ్మించింది. ఇదే క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. దాంతో ఆమె క్రిప్టో కరెన్సీ ‘బానోకాయిన్’‌లో పెట్టుబడులు పెట్టాలని అతడికి సూచించింది. మాయమాటలు చెప్పి, కచ్చితమైన రిటర్న్స్ వస్తాయని వాగ్ధానం చేసి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేలా ప్రోత్సహించింది. ఇంకా బానోకాయిన్ కస్టమర్ కేర్ ప్రతినిధి పేరుతో ఒకరితో మాట్లాడించింది కూడా.

  • SBI: ఇలా చిటికెలో బ్యాంక్ స్టేట్‌మెంట్ పొందండి.. ఒక్క మిస్డ్ కాల్‌తో క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్.. బ్యాంక్ బ్యాలెన్స్ సహా ఇంకెన్నో..

  • Hyderabad: హైదరాబాద్‌లో ఈ ఏరియాలోనే అద్దెలెక్కువ.. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలిలో రెంట్లు ఇలా.. బెంగళూరును దాటేసిందా?

ఆమె మాటలు నమ్మిన కుల్‌దీప్.. బానోకాయిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయ్యి.. వరుసగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. మొదట పెట్టిన లక్ష రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌కు 78 డాలర్ల రిటర్న్స్ వచ్చాయి. భారత కరెన్సీలో ఇది రూ. 6 వేలకుపైగా ఉంటుంది. దాంతో లాభాలు వస్తాయని.. పెట్టుబడుల్ని పెంచాడు. అలా మొత్తం 18 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.1.34 కోట్లు పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఈ లావాదేవీలు జులై 20- ఆగస్ట్ 31 మధ్య జరిగాయి.

సెప్టెంబర్ 3న అతడికి అసలు విషయం అర్థమైంది. తన క్రిప్టోకరెన్సీ అకౌంట్ నుంచి రూ. 2.59 లక్షలు విత్‌డ్రా చేద్దామని చూడగా.. తన అకౌంట్ ఫ్రీజ్ అయినట్లు అక్కడ చూయించింది. తనకు డేటింగ్ సైట్‌లో పరిచయమైన అమ్మాయితో మాట్లాడేందుకు ప్రయత్నించగా కుదర్లేదు. ఇక కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడగా.. అకౌంట్ తిరిగి ఓపెన్ కావాలంటే/తిరిగి పొందాలంటే మరో రూ. 35 లక్షలు జమ చేయాలని చెప్పారు. దీంతో అతడు మోసపోయినట్లు తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Free LPG Connections: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఫ్రీగా మరో 75 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు

Airbags in Cars: కార్లలో 6 ఎయిర్‌బ్యాగులపై కేంద్రం యూటర్న్.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన..

Read Latest Business News and Telugu News

Advertisement

Related Articles

Back to top button