credit score, CIBIL Score: మీకు తెలియకుండానే క్రెడిట్ స్కోరు తగ్గుతుందా? కారణాలివే కావొచ్చు.. ఇలా పెంచుకోవచ్చు.. – top reasons for low cibil score and how to improve it
ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. బాధలో ఐటీ ఉద్యోగులు.. మరీ ఇలా చేస్తుందని అనుకుంటారా?
లోన్ EMI ని సకాలంలోనే బ్యాంకులకు కడుతున్నా.. రుణదాత (లోన్స్ జారీ చేసేవారు) సంబంధిత విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు సవివరంగా నివేదించకపోవచ్చు. వాటిని ఆలస్యం చెల్లింపులుగా కూడా చూపొచ్చు. అప్పుడు క్రెడిట్ స్కోరు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లోనే మీరు అప్రమత్తంగా ఉండి.. మీరు చేసే పేమెంట్స్‌లో ఎలాంటి ఆలస్యం లేనప్పుడు దానిని సదరు రుణదాత దృష్టికి తీసుకెళ్లాలి. వెంటనే నివేదిక సవరించాలని కోరాలి.
ముఖ్యమైన డాక్యుమెంట్లు.. వ్యక్తిగత వివరాలుగా చెప్పే పేరు, పాన్ కార్డు డీటెయిల్స్, ఇంటి అడ్రస్ సహా పలు వివరాల్లో ఎలాంటి తప్పులు/అక్షర దోషాలు వంటి పొరపాట్లు ఉంటే.. లేట్ చేయకుండా.. బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇది లోన్ తీసుకునేటప్పుడు సమస్య రాకుండా చూస్తోంది.
ఏడాదిలో ఏకంగా 5.58 లక్షల ఇళ్లు.. ఈ 7 నగరాల్లోనే తెగ డిమాండ్.. హైదరాబాద్ పరిస్థితేంటి?
ఇంకొందరు హోం లోన్, వెహికిల్ లోన్ వంటి వాటిని ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారు. ఇలాంటప్పుడు లోన్ రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు చూపించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పాత పాత బ్యాంక్‌ను కలిసి.. లోన్ చెల్లించినట్లు క్రెడిట్ బ్యూరోకు తెలియజేయాలని కోరాలి. సమస్య తీరుతుంది.
కొన్ని సమయాల్లో మీ క్రెడిట్ రిపోర్టులో వేరే వ్యక్తి తీసుకున్న లోన్ వివరాలు కనిపిస్తుంటాయి. ఎంట్రీలో ఏదైనా తప్పు వల్ల ఇలా జరిగే అవకాశాలుంటాయి. అందుకే క్రెడిట్ రిపోర్టులో తప్పులు గమనిస్తే వెంటనే బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇంకొన్ని బ్యాంకులు మన రుణ పరిమితి పెంచినా.. ఈ సమాచారం క్రెడిట్ బ్యూరోలకు ఇవ్వకపోవచ్చు. ఈ పొరపాటు వల్ల కూడా క్రెడిట్ లిమిట్ అధిగమించినట్లు భావించి క్రెడిట్ స్కోరు తగ్గించే పరిస్థితులు వస్తాయి. ఇది కూడా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి.
ధనవంతులు కావడం ఎలా? డబ్బులు సంపాదించే 3 మార్గాల కోసం ఇక్కడ చూడండి..
- Read Latest Business News and Telugu News